అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
అక్షయ్ కుమార్ ఏంటి..1000 కోట్లు ఏంటి అనుకుంటున్నారా..? బాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోలలో అక్షయ్ అందరికంటే ముందుంటాడు.

అక్షయ్ కుమార్ ఏంటి..1000 కోట్లు ఏంటి అనుకుంటున్నారా..? బాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోలలో అక్షయ్ అందరికంటే ముందుంటాడు. ఈ కాలంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేయడమే గగనం అనుకుంటే.. ఇప్పటికీ అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేస్తుంటాడు. అంత బిజీగా ఉంటాడు ఈయన. షిఫ్టుల ప్రకారం పని చేయడం కూడా ఈయనకు అలవాటు. అలాగని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి మార్కెట్ దెబ్బ తీసుకోడు. ఈయన సినిమా చేసాడంటే కనీసం 200 కోట్లు వసూలు చేస్తుంది. విజయాలు కూడా అలాగే వస్తున్నాయి ఈ ఖిలాడీ హీరోకు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి.
అందులో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఎక్కువ రోజులు వెయిట్ చేయలేక లక్ష్మీ బాంబ్ లాంటి సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు దశల్లో ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోగా.. మరికొన్ని సినిమాలు విడుదల వరకు వచ్చి ఆగిపోయాయి. ఈ క్రమంలో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సూర్యవంశీ 2020 మార్చ్ లోనే రావాల్సింది.
కానీ ఇప్పటికీ రాలేదు.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర బిజినెస్ 300 కోట్ల వరకు జరిగింది. దాంతో మరో మూడు సినిమాలకు కలిపి 700 కోట్ల వరకు బిజినెస్ అయింది. అయితే అక్షయ్ కుమార్ ఆగిపోయిన సినిమాల బిజినెస్ విలువ 1000 కోట్లు అంటే నమ్మడం సాధ్యం కాదేమో..? ఎందుకంటే షారుక్, అమీర్, సల్మాన్ కంటే బాలీవుడ్ లో సంపాదన పరంగా చూసుకుంటే అక్షయ్ కుమార్ ముందుంటాడు. అందుకే ఈయన ఆగిపోయిన సినిమాలను లెక్క గడితేనే 1000 కోట్లు దాటిపోయింది. ఒప్పుకున్న సినిమాల బిజినెస్ లెక్క కడితే 2000 కోట్లు అవుతుందేమో..?
ఇవి కూడా చదవండి..
కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలి
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

