‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
ఒక వెబ్ సిరీస్ కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. ఒక్కరోజే దాదాపు 13 కోట్ల మంది చూసే అంత క్రేజ్ ఉంటుందా.. సినిమాలకు మించిన పారితోషికం అందుకునే సీనుందా.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం ఫ్యామిలీ మ్యాన్ 2

ఒక వెబ్ సిరీస్ కు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. ఒక్కరోజే దాదాపు 13 కోట్ల మంది చూసే అంత క్రేజ్ ఉంటుందా.. సినిమాలకు మించిన పారితోషికం అందుకునే సీనుందా.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం ఫ్యామిలీ మ్యాన్ 2. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా రికార్డులు తిరగరాస్తోంది ఫ్యామిలీ మ్యాన్ 2. తొలి సీజన్ 2018లో విడుదలైతే.. రెండవ సీజన్ రావడానికి మూడేళ్లు తీసుకున్నారు. నిజానికి ఫిబ్రవరి 12న విడుదల కావాలి.
కానీ అప్పుడు కొన్ని కాంట్రవర్సీలు రావడంతో 3 నెలలు ఆలస్యంగా విడుదల అయింది. అయినా కూడా దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మనోజ్ బాజ్ పేయి, సమంత అక్కినేని, ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇండియా- శ్రీలంక నేపథ్యంలో తెరకెక్కింది. తొలి సీజన్ అంతా ఇండియా- పాకిస్తాన్ టెర్రరిజం చుట్టూ కథ అల్లుకున్నారు రాజ్ డీకే. ఇక్కడ మూడో భాగానికి కూడా కథ సిద్ధం చేసుకుంటున్నారు. రెండో సీజన్ ఇలా విడుదలైందో లేదో మూడో సీజన్ కోసం అప్పుడే స్క్రిప్ట్ పని మీద బిజీ అయిపోయారు దర్శక ద్వయం. ఇండియా-పాకిస్తాన్, ఇండియా-శ్రీలంక తొలి రెండు సీజన్స్ లో చూపించారు.
మూడో సీజన్ కోసం చైనాను టార్గెట్ చేయనున్నారు రాజ్ డి.కె. పైగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యామిలీ మాన్ 3 ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. రెండో సీజన్ చివర్లో ఒక చైనీస్ వ్యక్తి కంప్యూటర్ లో ఏదో చైనా భాషలో టైప్ చేస్తూ కనిపిస్తాడు. దీన్ని బట్టి మూడో భాగం అంతా ఇండియా-చైనా నేపథ్యంలో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. 2023 ప్రథమార్ధంలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విడుదల కానుంది. అందులోనూ మనోజ్ బాజ్ పేయి కీలకపాత్రలో నటించబోతున్నాడు. రెండో సీజన్ సాధించిన విజయం మూడో భాగంపై అంచనాలు భారీగా పెంచేసింది.
ఇవి కూడా చదవండి..
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

