కృష్ణ చైతన్య డైరెక్షన్ లో టాలీవుడ్ యాక్టర్ నితిన్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పవర్ పేట అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇపుడు ఇదే సినిమా గురించి ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కృష్ణ చైతన్య ఇదే కథతో యువ నటుడు శర్వానంద్ ను సంప్రదించాడట.
కృష్ణ చైతన్య చెప్పిన కథ శర్వానంద్ కు కూడా నచ్చిందని టాక్ వినిపిస్తోండగా..అతని ఫైనల్ డెసిషన్ ఒకటే పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమాతోపాటు ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. మరి కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమాకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఒకవేళ ఇస్తే ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!