బుధవారం 27 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 00:12:42

ఎవరి కోసం పుట్టానో తెలిసింది

ఎవరి కోసం పుట్టానో తెలిసింది

వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. వైష్ణవ్‌తేజ్‌ జన్మదినం సందర్భంగా టీజర్‌ను చిత్రబృందం బుధవారం విడుదలచేసింది. ‘ఎవరికి పుట్టామో అందరికి తెలుస్తుంది. ఎవరి కోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది’ అంటూ వైష్ణవ్‌తేజ్‌ చెప్పే సంభాషణలతో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది.  ‘లవ్‌ యూ ఐ కాదు.. ఐ లవ్‌ యూ అని రాయాలి కదా’ అంటూ వైష్ణవ్‌తేజ్‌ అడిగిన ప్రశ్నకు ‘మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కనపెట్టేశా’ అని కృతిశెట్టి చెప్పే సమాధానం ప్రేమబంధంలోని ఔన్నత్యాన్ని  చాటుతుంది. హృద్యమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆహ్లాదభరితంగా టీజర్‌ సాగింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. 


logo