e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు..  అదెలానో మీరూ తెలుసుకోండి.!

గోర్లపై రకరకాల మచ్చలు, గీతలను చూస్తుంటాం కానీ అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనే ప్రయత్నం మాత్రం చేయం. మన గోర్లే మన ఆరోగ్యాన్ని చెబుతాయని చాలా మందికి తెలియదు. జట్టు మాదిరిగానే గోళ్లు కూడా కెరోటిన్‌ అనే ప్రొటీన్‌తో ఏర్పడుతాయి. గోర్లు ఆరోగ్యంగా ఉంటే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లుగానే లెక్కించుకోవాలి. అవి బలంగా ఉండాలంటే పోష‌కాహారం శ‌రీరానికి అందివ్వాల‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ స‌మ‌స్య రాగానే మ‌న కాలి, చేతి గోళ్లు పసుపు రంగులోకి మార‌డంతోపాటు పెళుసుగా త‌యార‌వుతాయి. ఒనికోమైకోసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ గుర్తులుగా ఇలా గోర్ల‌పై ప‌సుపు రంగు క‌నిపిస్తుంది. ఇలా రావ‌డం మీలో టైప్ 2 డ‌యాబెటిస్‌ను ప్రారంభమ‌య్యేందుకు సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారిలో ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాలి పెద్ద గోరు సాధార‌ణంగా ఒనికోమైకోసిస్‌కు ప్ర‌భావిత‌మ‌వుతుంది. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా గోర్ల‌పైనే క‌నిపిస్తుంది. గోరుపై గీత‌లు కూడా క‌నిపిస్తాయి. గోరు అంచులు విరిగిపోతుండ‌టం, ప‌గుళ్లు ఏర్పడుతుండ‌టం గ‌మనించ‌వ‌చ్చు.

- Advertisement -

ఒకటి లేదా రెండు గోర్ల‌లో 50 శాతం కన్నా తక్కువ ప్రభావితం చేసే తేలికపాటి ఇన్ఫెక్షన్లు అందుబాటులో ఉండే సాధార‌ణ‌ యాంటీ ఫంగల్ మందులకు ప్రతిస్పందిస్తాయి. అయితే పూర్తిగా నివార‌ణ‌కు యాంటీ ఫంగ‌ల్ మందుల‌ను ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కువ‌గా 60 ఏండ్ల వ‌య‌సు పైబడిన వారిలో కనిపిస్తుంది.

రక్తంలో అధిక చక్కెరకు సంకేతాలు

దాహం పెరుగుతుంది, నోరు పొడిగా ఉంటుంది.

త‌రుచుగా మూత్రి విస‌ర్జ‌న‌కు వెళ్తుంటారు.

చిన్న ప‌నికే అల‌స‌టగా ఉంటుంది.

దృష్టి మ‌స‌క‌గా ఉండ‌టం

అనుకోకుండా బరువు తగ్గడం

మూత్రాశయ ఇన్ఫెక్షన్, చర్మ ఇన్ఫెక్షన్ వంటివి రావ‌డం

కడుపు నొప్పి రావ‌డం

అనారోగ్యానికి గుర‌వడం లేదా అనుభూతి క‌లుగ‌డం వంటి సంకేతాలు క‌నిపిస్తాయి. వీటిని బ‌ట్టి మ‌న ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతున్న‌ట్లు గుర్తించి తగు వైద్యం తీసుకోవ‌డం అవ‌సరం. ఇలాంటి స‌మ‌స‌య మొద‌ల‌వ‌గానే చ‌క్కెర లేని ద్ర‌వాలు, నీరు ఎక్కువ‌గా తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. నిత్యం అర్ధ‌గంట‌కు త‌క్కువ కాకుండా వ్యాయామం చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. చెడు అల‌వాట్ల‌ను దూరం పెట్టాలి. పోష‌కాహారాన్ని ప్లేటులో ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్రోటీన్ వ‌న‌రు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్త‌మం

బ‌హు భార్య‌త్వానికి మ‌ద్ద‌తు.. లా ప్రొఫెస‌ర్‌కు ఇక్క‌ట్లు

ఆంక్ష‌ల పొడ‌గింపు : బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న డెల్టా వేరియంట్‌

గెలుపు కోసం : యూపీలో త్వ‌ర‌లో క్యాబినెట్ విస్తరణ..?

ఏడాది ఆల‌స్యం : అక్టోబ‌ర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్‌పో 2020

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

అంత‌రిక్షం నుంచి వ‌చ్చిన‌ స్పెర్మ్‌తో 168 ఎలుక‌లు

చాలా ఆరుదు : త‌వ్వ‌కాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు..  అదెలానో మీరూ తెలుసుకోండి.!
గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు..  అదెలానో మీరూ తెలుసుకోండి.!
గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు..  అదెలానో మీరూ తెలుసుకోండి.!

ట్రెండింగ్‌

Advertisement