e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

ఇవాళ ర‌క్త‌దాన దినోత్స‌వం. రక్తాన్ని గ్రూపులుగా ఆవిష్కరించిన కరల్ ల్యాండ్ స్కేనర్ జయంతిని పురస్కరించుకుని ఏటా జూన్ 14 న రక్తదాన దినోత్సవం జరుపుకుంటాం. ఒక యూనిట్‌ రక్తాన్ని దానం చేయమంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటమే. ప్రతీ రక్తపు బొట్టు మరొకరి ప్రాణానికి ఆధారమవుతున్న‌ది. ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరంపడుతున్న‌ది. కానీ రక్తం దొరకడమే కష్టమవుతున్న‌ది. రోగికి రక్తం అవసరమైతే.. దానికి బదులుగా మరొకరు రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రక్తం 60 శాతం ద్రవభాగం, 40 శాతం ఘనభాగంతో ఉంటుంది. దీనిలో ప్లాస్మా అనే ద్రవభాగం 90 శాతం నీరు, 10 శాతం పోషకాలు, హార్మోన్లతో ఉంటుంది. దీని శాతం తగ్గితే ఆహారం, ఔషధాలతో తిరిగి భర్తీ చేయవచ్చు. అయితే, ఘన భాగమైన ఎర్ర, తెల్లరక్త కణాలను తిరిగి పొందలేం. దీన్ని భర్తీ చేయాలంటే రక్తదానం అనివార్యం అవుతుంది. మన దేశంలో ఏటా 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా.. 4 లక్షల యూనిట్లు మాత్రమే లభ్యమవుతుండ‌టం విచార‌క‌రం.

మ‌రొక‌రికి ప్రాణం పోయ‌డ‌మే..

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం
- Advertisement -

రక్తదానం చేయడం ప్రాణాంతకం కాదు. కష్టమైన, శ్రమతో కూడిన పనులు చేసుకునేవారు కూడా రక్తమిచ్చి చక్కగా పనులు చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 50 ఏండ్ల‌ లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ‌వ‌చ్చు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు నెలలు, పురుషులైతే మూడు నెలల తర్వాతనే మళ్లీ ర‌క్తాన్ని ఇవ్వడానికి వీలుంటుంది. సగటు 45 కేజీల బరువు కంటే ఎక్కువగా ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయాలి. ఒక వ్యక్తి 168 సార్లు రక్తదానం చేయవచ్చు. ఒక వ్యక్తి మూడునెలలకొకసారి రక్తదానం చేయవచ్చు.

ర‌క్త‌దానం ఎవ‌రు చేయ‌కూడ‌దు..

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

మ‌త్తుమందుకు అలవాటు పడ్డవారు రక్తదానానికి అనర్హులు.

స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలు ఆపేంత వరకు రక్తదానం చేయకూడదు.

హెపటైటిస్ బీ, సీ, హెచ్‌ఐవీ, అధిక రక్తపోటు ఉన్నవారు రక్తదానం చేయకూడదు.

షుగర్ కంట్రోల్‌లో లేనివారు, గుండెవ్యాధి, క్యాన్సర్ ఉన్నవాళ్లు రక్తం ఇవ్వకూడదు.

రెండు నెలలుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి రక్తం తీసుకోకూడదు.

అపోహ‌లు.. వాస్త‌వాలు..

చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

రక్తదానం చేయడం వల్ల శరీరం నీరసించిపోతుందని, రకరకాల వ్యాధులకు గురవుతామనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అయితే రక్తదానం చేయడం వల్ల ఒక‌రి ప్రాణం కాపాడ‌ట‌మే కాకుండా దాత‌ల‌కు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.

రక్తదానం చేయడం వ‌ల్ల‌ శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గి క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది.

రక్తదానం చేయడం వల్ల పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

రక్తంలోని ఐరన్ స్థాయిలు నిర్ణీతంగా ఉంచబడటం కారణంగా గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి

రక్తమిచ్చేటప్పుడు రక్త పరిమాణం సమతుల్యం చెంది రక్తపోటును నియంత్రిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులు నివారించడానికి రక్తదానం మంచిది.

శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్రరక్త కణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

రక్తదానం చేయటం వలన రక్తనాళాల గోడలు ప్రమాదానికి గురవటం తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

రక్తదానం పూర్తి శాస్త్రీయమైన.. సురక్షితమైన పద్ధతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా జరుగుతుంది.

రక్తదానం తర్వాత ఎలాంటి రక్తహీనత ఏర్పడదు. ఒక యూనిట్ రక్తంలోని ఎర్ర రక్త కణాలు 3 రోజుల్లో, తెల్ల రక్తకణాలు 3 వారాల్లోనే తిరిగి ఏర్ప‌డ‌తాయి.

ఒకసారి రక్తదానం చేయటం వలన 650 క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. ఫలితంగా శరీర బరువు తగ్గుతుంది.

తరచూ రక్తదానం చేయటం కూడా ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోవాలి.

రక్తదానం చేయటం వలన జీవితకాలం పెరుగుతుంది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2010: ఉత్తరప్రదేశ్‌లోని గంగా నదిలో పడవ మునిగి 52 మంది దుర్మ‌ర‌ణం

1998: బిహార్‌లో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అజిత్ సర్కార్ దారుణ‌హత్య

1977: అమెరికా దేశ‌ జెండాకు గుర్తింపు

1963: వోస్టాక్ -5 అంతరిక్ష నౌకను ప్రయోగించిన సోవియ‌ట్ యూనియ‌న్‌

1940: పోలాండ్‌లోని ఆష్విట్జ్‌లోని నాజీల‌కు చెందిన నిర్బంధ శిబిరంలో దాదాపు కోటి మంది ఖైదీల‌ హత్య

1925: క్యూబన్ విప్లవ నిర్మాత చే గువేరా జన‌నం

1864: అల్జీమ‌ర్స్ వ్యాధిని క‌నిపెట్టిన‌ ఎలియోస్ అల్జీమర్ జన‌నం

ఇవి కూడా చ‌ద‌వండి..

అంత‌రిక్షం నుంచి వ‌చ్చిన‌ స్పెర్మ్‌తో 168 ఎలుక‌లు

చాలా ఆరుదు : త‌వ్వ‌కాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు

రాజ‌కీయ రంగు : త్వ‌ర‌లో బ్రాహ్మ‌ణేత‌ర పూజ‌రుల నియామ‌కం

75 ఏండ్ల కానుక : త్వ‌ర‌లో క‌నీస వ‌య‌సులో మార్పులు..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం
చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం
చ‌రిత్ర‌లో ఈరోజు : ర‌క్త‌దానంతో మ‌రొక‌రికి ప్రాణ‌దానం

ట్రెండింగ్‌

Advertisement