RTC Driver Ashok | జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా చేస్తుండగా.. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుండి తొలగించారని తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను మాజీ మంత్రి గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి కలిశారు.
అశోక్ సస్పెన్షన్ విషయమై అడుగగా జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తాను సస్పెండ్ చేయలేదని, డిపో మేనేజర్ కూడా చేయలేదని రీజినల్ మేనేజర్ బుకాయించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే గంగుల కమలాకర్ అశోక్ రిమూవల్ లెటర్ చూపించాక బహుశా డిపో మేనేజర్ చేసి ఉంటారని నాకు సమాచారం లేదని రీజినల్ మేనేజర్ మాట మార్చడం గమనార్హం.
రీజినల్ మేనేజర్‌కు తెలియకుండా డిపో మేనేజర్ ఎలా సస్పెండ్ చేస్తాడని, డిపో మేనేజర్ మీద చర్యలు తీసుకోవాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. వెంటనే అశోక్ సస్పెన్షన్ రద్దు చేయాలని గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను కలిసిన గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి
జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తాను సస్పెండ్ చేయలేదని, డిపో మేనేజర్ కూడా చేయలేదని బుకాయించిన రీజినల్ మేనేజర్
రిమూవల్ లెటర్ చూపించాక బహుశా డిపో మేనేజర్ చేసి ఉంటారని నాకు సమాచారం లేదని మాట మార్చిన రీజినల్… https://t.co/4DupGLax2j pic.twitter.com/IYAjXCxiHu
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026