Petro prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరో రూ.20 పెరగనున్నాయా..?
Petro prices | దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్ (Indian Oil), భారత్ పెట్రోలియం (Bharat petrolium), హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petrolium) లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు.
Petro prices : దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్ (Indian Oil), భారత్ పెట్రోలియం (Bharat petrolium), హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petrolium) లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, మన రిటైల్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాలంటే లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒక్కసారిగా అంత భారం మోపడం సాధ్యం కాకపోయినా.. విడతల వారీగా ధరల బాదుడు తప్పదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంతో ఫిబ్రవరి 28 నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం 88 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. కానీ ధరలను స్థిరంగా ఉంచడంవల్ల మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకుపైగా భారం పడింది.
ఇప్పుడు ఆ మూడు ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చేందుకు ధరల పెంపుపై దృష్టిసారించారు. ఇప్పటికే గత పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్ ధరలను పెంచారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమైతే మన చమురు సంస్థలకు ఊరట కలుగుతుంది. అయినా రవాణా ఖర్చులు, పాత నష్టాలవల్ల ధరల భారం వెంటనే తగ్గే అవకాశం లేదు. ఇటు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం పడకుండా అటు చమురు సంస్థలు నష్టపోకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

