GT vs RCB : ధర్మశాల వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(19)ను స్వల్ప స్కోర్‌కే వెనక్కి పంపిన రబడ(39-1)ను విరాట్ కోహ్లీ(34 నాటౌట్), పడిక్కల్(23 నాటౌట్) ఉతికేశారు. హోల్డర్, రబడ ఓవర్లో బౌండరీలో వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దూకుడుగా ఆడిన ఈ ద్వయం 23 బంతుల్లోనే అర్ధ శతక భాగస్వామ్యంతో పవర్ ప్లేను ముగించింది.
క్వాలిఫయర్ 1లోనూ గుజరాత్ టైటాన్స్ పేసర్ రబడ(39-1) చెలరేగాడు. తొలి ఓవర్లోనే ఆర్సీబీ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(19) వికెట్ సాధించాడు. ఫైన్ లెగ్‌లో సిక్సర్ బాదిన అయ్యర్.. మిడాఫ్‌లో ఆడిన బంతిని గిల్ వెనక్కి పరుగెత్తుతూ వెళ్లి అందుకున్నాడు. 21 పరుగుల వద్దే తొలి వికెట్ పడినా పడిక్కల్(23 నాటౌట్), కోహ్లీ(34 నాటౌట్)లు స్కోర్ వేగం తగ్గకుండా చూసుకున్నారు.
SIX, annnd OUT! ☝️
🎥 Kagiso Rabada cranks up the pace to dismiss Venkatesh Iyer 🔥👏
Updates ▶️ https://t.co/9rs6u5obOw#TATAIPL | #Qualifier1 | #TheFinalLeap | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/GzXmR4AtqS
— IndianPremierLeague (@IPL) May 26, 2026
రబడను ఒత్తిడికి గురి చేస్తూ నాలుగో ఓవర్లో కోహ్లీ ఒక ఫోర్, పడిక్కల్ మూడు బౌండరీలతో ఆర్సీబీ స్కోర్ యాభైకి చేరింది. ఆరో ఓవర్లోనూ విరాట్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో రెచ్చిపోగా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆర్సీబీ 76 పరుగులు చేసింది.