చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో 1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డు ఇన్నేండ్లయినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా కొంచెం విరిగిపోయింది

జెరూసలేం : ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో 1000 సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యకరంగా ఈ గుడ్డు ఇన్నేండ్లయినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్బుక్లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు.
మధ్య ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొరకడం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పురవాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. తవ్వకాలు జరుపుతుండగా వివిధ జంతువుల గుడ్ల పెంకులు బయటపడటం జరుగుతుందని, అయితే ఇంత పురాతన గుడ్డు మొత్తం దొరకడం ప్రపంచంలోనే ఇది తొలిసారని ఆమె పేర్కొన్నారు.
డేవిడ్ సిటీలో గతంలో జరిపిన తవ్వకాల్లో చాలా గుడ్డు పెంకులు లభించాయి. 10 వ శతాబ్దం నాటి ప్రాంతం నుంచి ఈ కోడిగుడ్డు కనుగొన్నట్లు ఇజ్రాయెల్ పురవాస్తు విభాగం అధికారులు తెలిపారు. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజులకే చెడిపోతున్న తరుణంలో వేయి సంవత్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భద్రంగా ఉందో కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

