e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

టీ అన‌గానే మ‌న‌కంద‌రికీ వేడి వేడి చాయ్ గుర్తుకొస్తుంది. కాని ఐస్ టీ ర‌కాలు కూడా ఉన్నాయ‌ని బ‌హుశా చాలా మందికి తెలియ‌దు. న‌గ‌రాల్లో అందుబాటులో ఉన్న ఐస్ టీ ల‌తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఐస్ టీ తాగ‌డం ద్వారా తాజా శ్వాస అంద‌డంతో పాటు మానసిక ఉల్లాసంతోపాటు ఎన్నో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చంటున్నారు పోష‌కాహార నిపుణులు. జూన్ 10.. నేష‌న‌ల్ ఐస్ టీ దినం. ఈ సంద‌ర్భంగా ఐస్ టీ సేవిస్తే ఎలా మంచిదో తెలుసుకుందాం.

ఐస్ టీ గుండెకు మంచిదని ప‌లు పరిశోధనల్లో తేలింది. నిత్యం మూడు కప్పుల ఐస్ గ్రీన్ టీ తాగేవాళ్లలో గుండె పోటు వచ్చే అవకాశాలు 35 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఐస్ టీ తాగడం వ‌ల్ల‌ డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఐస్ టీని రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే శ‌రీరంలో ద్ర‌వాల స్థాయిలు పెరుగి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శ‌రీరం నుంచి విష వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి ఐస్ టీకి ఉన్న‌ది. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడి ఫ్రీ రాడికల్స్‌ అంతు చూస్తాయి. పండ్లు, కూరగాయల్లో కంటే 8 రెట్లు ఎక్కువగా వీటిలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దంతాల‌ను పాడుచేసే కేవిటీస్‌పై పోరాడి దంతాలు పాడవకుండా ఐస్ టీ సాయ‌పడుతుంది. ఐస్ టీలో ఉండే పోషకాలు కాన్సర్‌తో పోరాడతాయని 3వేలకు పైగా పరిశోధనల్లో తేలింది. శరీరానికి ఎక్కువ మొత్తంలో మాంగనీస్ కావాలనుకునేవారు ఐస్ టీ తాగ‌డం శ్రేయ‌స్క‌రం. మాంగనీస్ దెబ్బలు త్వరగా తగ్గడంలో, ఎముకలు గట్టిపడటంలో స‌హ‌క‌రిస్తుంది.

యుఎస్‌లో తొలిసారిగా..

ఐస్డ్ టీ 1870 నుంచి అమెరికాలో అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు చెప్తుంటారు. తొలిసారిగా 1871 లో మేరీ ఆన్ బ్రయాన్ రాసిన కుక్‌బుక్‌లోఐస్డ్ టీ గురించి ప్రస్తావించారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఐస్డ్ టీలో జాపత్రి, లవంగం, తులసి వేసి మ‌రిగించి సేవించ‌డం ద్వారా చాలా ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు.

బ్లాక్‌బెర్రీ మింట్ ఐస్డ్ టీ

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

బ్లాక్‌బెర్రీస్‌ను గ్రైండ్ చేసి వడకట్టి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 5 టీ-బ్యాగులు వేసి దానిలో పుదీనా ఆకులు కూడా వేసి వేడినీరు పోసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచండి. ఫిల్టర్ చేసి గది ఉష్ణోగ్రతకు చల్లబరచాలి. ఇప్పుడు టీలో చక్కెర సిరప్ వేసి మ‌రింత చ‌ల్ల‌గా అయ్యేట్లు చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు, 2-3 బ్లాక్‌బెర్రీలను ఐస్‌తో అలంకరించి స‌ర్వ్ చేస్తే బాగుంటుంది.

లీచీ ఐస్డ్ టీ

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

లిచ్చీని తొక్క తీసి ముక్కలుగా కోసి.. పంచదార, కొంచెం నీరు వేసి మిక్సర్‌లో రుబ్బుకుని జల్లెడ ప‌ట్టుకోవాలి. ఒక కుండలో నీరు, చక్కెర కలిపి తక్కువ మంట మీద ఉడికించాలి. నురుగు కనిపించిన వెంటనే దానికి టీ ఆకులు క‌లిపి మ‌రో 1-2 నిమిషాలు ఉడికించి దించేయాలి. దీనికి నిమ్మరసం వేసి ఫిల్టర్ చేసి చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత స‌ర్వ్ చేస్తే టేస్టీగా ఉంటుంది.

నిమ్మకాయ బాసిల్ ఐస్డ్ టీ

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

ఒక గిన్నెలో నిమ్మకాయ ముక్కలు, తులసి ఆకులు, గ్రీన్ టీ సంచులను తీసుకుని వీటికి వేడినీరు కల‌పాలి. త‌ర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంత‌రం టీ-బ్యాగ్స్ తీసి పక్కన పెట్టి చల్లబరచడానికి 3-4 గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తులసి ఆకులు, నిమ్మకాయ ముక్కలతో చల్లగా వడ్డిస్తే చాలా బాగుంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇక నిశ్చింత : క‌రోనా రోగుల సేవ‌లో గ్రేస్ రోబోట్

ఆర్థిక సాయం : తాలిబాన్‌ కోసం పాకిస్తాన్ మసీదుల్లో విరాళాల సేక‌ర‌ణ‌

ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మ‌రోసారి ఊహాగానాలు..!

నియామ‌కం : యూఎన్‌ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగ‌రాజ్ నాయుడు

హార్ట్ రిథ‌మ్ : క‌రోనా కార‌ణంగా అరిథ్మియాకు అవ‌కాశాలు

డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్ల‌లో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు

సివిల్స్ 2020 : ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ విడుద‌ల

35 ఏండ్ల క్రితం : లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజ‌యం చిరస్మ‌ర‌ణీయం

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

ట్రెండింగ్‌

Advertisement