ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారి టెస్ట్ మ్యాచ్‌లో సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 లో ఇదే రోజున భారత్ విజయాన్ని దక్కించుకున్నది. భారత కెప్టెన్ కపిల్ దేవ్ చివరి బంతికి సిక్సర్ కొట్టి ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు లార్డ్స్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో భారత్ 8 ఓడిపోయి 2 డ్రా చేసింది. ఈ సిరీస్‌కు ముందు భారత్ మొత్తం 105 టెస్ట్ మ్యాచ్‌లను విదేశీ గడ్డపై ఆడింది. అందులో 51 మ్యాచ్‌లు ఓడిపోగా, 44 డ్రాగా ముగిశాయి. 10 మ్యాచుల్లో మాత్రమే భారత జట్టు గెలిచింది.
లార్డ్స్‌లో తొలి విజయాన్నిఅందుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో గొప్పగా ఉండి మంచి ఫీల్డింగ్ చేసింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, మొహిందర్ అమర్నాథ్, రవిశాస్త్రి, మనీందర్ సింగ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టు తరపున ఆడారు. టాస్ గెలిచిన కపిల్ దేవ్ మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లండ్ తరఫున గూచ్ 114 పరుగులు చేయగా, భారత్ తరఫున దిలీప్ వెంగ్‌సర్కార్ 126 పరుగులు చేశాడు. చివరకు భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో క్రీజులోకి వచ్చిన కపిల్‌దేవ్.. కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 23 పరుగులు రాబట్టి భారత్‌కు లార్డ్స్‌లో తొలి టెస్ట్ విజయాన్ని అందించాడు. కపిల్‌దేవ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. మణిందర్సింగ్తో కలిసి కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌కు పరుగులు అందకుండా చేయగలిగాడు. దాంతో ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్నది. ఈ మైదానంలో విజయంతో టెస్ట్ మ్యాచ్ రూపురేఖలే మారిపోయేలా భారత్ పాటుపడిందని చెప్పవచ్చు.
2019: నటుడు, దర్శకుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూత
1977: ఆపిల్ -2 అనే కంప్యూటర్ను లాంచ్ చేసిన ఆపిల్
1971: చైనాపై 21 ఏళ్ల వాణిజ్య ఆంక్షను ముగించిన అమెరికా
1967: ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య ముగిసిన 6 రోజుల యుద్ధం
1946: రాచరికం ముగిసిన తర్వాత రిపబ్లికన్ దేశంగా మారిన ఇటలీ
1890: ఆదివారం సెలవుదినం ప్రారంభం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..