e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News మా పెళ్లి చెల్ల‌దు : భ‌ర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్ర‌త్‌

మా పెళ్లి చెల్ల‌దు : భ‌ర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్ర‌త్‌

మా పెళ్లి చెల్ల‌దు : భ‌ర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్ర‌త్‌

న్యూఢిల్లీ : భర్త నిఖిల్ జైన్‌తో విడిపోవడంపై బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎట్టకేలకు మౌనం వీడింది. నిఖిల్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఇది భారతదేశంలో చెల్లదని ఆమె బుధ‌వారం ఒక సుదీర్ఘ‌ ప్రకటనలో వెల్లడించింది.

కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తుల మాదిరిగా తన వస్తువులను ‘అక్రమంగా వెనక్కి తీసుకున్నారు’ అని ఆమె ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల నుంచి డ‌బ్బు తీసుకున్నాడ‌ని కూడా ఆమె ఆరోపించింది. మా వివాహం చ‌ట్ట‌బ‌ద్ధ‌మైంది కాదు, అందుకే అతడి నుంచి విడాకులు తీసుకోవలసిన అవసరం లేద‌ని నుస్ర‌త్ స్ప‌ష్టం చేశారు. మేము ఇప్ప‌టికే విడిపోయి ఉంటున్నామ‌ని, కాని ఈ విష‌యాన్ని ఈ రోజు అంద‌రి ముందుంచుతున్నాను ఎందుకంటే నా వ్యక్తిగత జీవితాన్ని నాలోనే ఉంచుకోవాలని అనుకున్నానని నుస్ర‌త్ పేర్కొన్నారు. మాది కులాంత‌ర వివాహ‌మ‌ని, ఇది భారతదేశంలో చట్టబద్ధమ‌ని నిరూపించడానికి ప్రత్యేక వివాహ చట్టం క్రింద నమోదు చేయవలసి ఉన్న‌ప్ప‌టికీ అది జ‌రుగ‌లేనందున విడాకుల ప్రశ్నే తలెత్తదన్నారు.

నా అనుమ‌తి లేకుండా నా అకౌంట్ల నుంచి డ‌బ్బు విత్‌డ్రా చేయ‌డంపై బ్యాంకు అధికారుల‌కు ఫిర్యాదు చేశాన‌ని చెప్పారు. పెండ్లి త‌ర్వాత నా బ్యాంకు అకౌంట్ల వివరాలు అన్నీ నిఖిల్‌కు చెప్పాన‌ని, అయితే నా అనుమ‌తి లేకుండా పెద్ద మొత్తంలో నిధుల‌ను తీసుకున్నాడ‌ని నుస్ర‌త్ వెల్ల‌డించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని బసిర్‌హాట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అనంత‌రం టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను నుస్ర‌త్ వివాహం చేసుకున్నారు. వివాహ రిసెప్షన్ కోల్‌కతాలో జరిగింది. ఇందులో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. టర్కీ చట్టం ప్రకారం ఆమె నిఖిల్‌ను వివాహం చేసుకున్నట్లు నుస్రత్ తెలిపారు. ఇలాఉండ‌గా, త‌న‌తో నుస్ర‌త్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన న‌టుడు యాష్ దాస్‌గుప్తా ఇప్ప‌టికే చెప్ప‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి..

పెద్ద పొర‌పాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ

న‌యా దోపిడీ : న‌కిలీ యాప్‌తో 5 లక్ష‌ల మందికి 150 కోట్ల మోసం

మ‌మ‌త డిమాండ్ : కొత్త‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించాల్సిందే..!

కొత్త‌ రికార్డ్ : ప‌ది మందికి జ‌న్మ‌నిచ్చిన సౌతాఫ్రికా మ‌హిళ‌

ఓపెన్ లెట‌ర్ : స్కాల‌ర్‌షిప్‌ కోసం బిర్సా కుటుంబీకుల విన‌తి

ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తిన‌డం మాకు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన హ‌క్కు

మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌

స‌మ‌ష్ఠి విజ‌యం : తొలి మాస్క్ ర‌హిత దేశంగా ఇజ్రాయెల్

చ‌రిత్ర‌లో ఈరోజు.. గిరిజ‌నుల ఆరాధ్య‌దైవం బిర్సా ముండా

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మా పెళ్లి చెల్ల‌దు : భ‌ర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్ర‌త్‌

ట్రెండింగ్‌

Advertisement