నంగునూరు, మే 30: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఎదురొంటున్న ఇబ్బందులను ఆయనతో చెప్పుకొన్నారు. రైతుల ఆవేదనను విన్న హరీశ్‌రావు వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు.
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిసంతో రైతుల ఉచిత విద్యుత్‌కు ఉరితాడు పడబోతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇకడి భూముల ధరలు ఎకరాకు రూ. 50 లక్షలు వరకు పలికేవని, ఇప్పుడు పాతాళానికి పడిపోయాయని అన్నారు. రూ. 30 లక్షలకు ఇస్తామన్నా కొనే నాథుడు లేడన్నారు. తన కొడుకు పైలట్ చదువు ఫీజు కట్టడానికి భూమి అమ్ముకుందామంటే, ఎవరూ కొనట్లేదని స్వయంగా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని హరీశ్‌రావు అన్నారు. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం.. రాగానే రైతుబంధుకు ఎగనామం పెట్టిందన్నారు. చాలామంది రైతులకు రైతుబంధు రాలేదన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు చేశామన్నారు. నేడు కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ అనేది లేకుండా చేసి, కటింగ్ల పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని తెలిపారు. పంట పండించడానికి ఒక కష్టం అయితే, పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా.. ఒక మెసేజ్ పెడితే పావుగంటలో పరిషారం అయ్యేదని, ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకున్నా, మీ తరఫున ప్రతిరోజూ మీడియా వేదికగా నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నానన్నారు. మీ సమస్యల పరిషారం కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడుతా అన్నారు. భయపడకండి, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హరీశ్‌రావు అన్నారు.