Mahesh Babu | నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజుల నుంచే మహేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ ప్రారంభించారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్లో ‘ప్రిన్స్’, ‘సూపర్‌స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు.. అంచెలంచెలుగా ఎదిగి తండ్రి సూపర్‌స్టార్ కృష్ణకు తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. కృష్ణ వారసుడిగా బాలనటుడిగానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్.. 1979లో విడుదలైన ‘నీడ’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు.. తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్లో తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్నారు. ‘ఒక్కడు’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన.. ‘అతడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. మహేష్ బాబు సినిమాలు విడుదల సమయంలోనే కాకుండా రీ-రిలీజ్‌లలోనూ భారీ స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. ఆయనకు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ మహేష్ బాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి ఆయనకు సంబంధించిన ప్రత్యేక లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఇక మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈసారి మహేష్ బర్త్‌డే వేడుకలు అభిమానులకు ఎలాంటి మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయో చూడాలి.
Another trip around the Sun… before we travel across time.
Happy Birthday Rudhra 💙 @urstrulymahesh #Varanasi pic.twitter.com/Iqa3QLtHiR
— Varanasi (@VaranasiMovie) August 9, 2026