Travel bus | ఏపీలో(Andhra Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై(Bridge) నుంచి ట్రావెల్ బస్సు(Travel bus) కింద పడటంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాకర సంఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పొగురూరు బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇవి కూడా చదవండి..
Iran | అమెరికా మారేంత వరకు హర్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్
Honey trap | వింగ్ కమాండర్‌పై హనీట్రాప్..పాకిస్థాన్ మహిళకు రక్షణ సమాచారం లీక్
Abhijit Deepke | పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి : దీప్కే