శంభాజీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను ఉద్దేశించి తప్పక ప్రసంగించాలని, వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘విద్య, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నది యువతకు వివరించాలని మేం ప్రధానిని కోరుతున్నాం’ అని అన్నారు. ఆయన ఆన్లైన్ పిటిషన్ లింక్ ఒకదానిని షేర్ చేస్తూ ‘మీరు ఈ ప్రచారానికి మద్దతు ఇస్తే సంతకం చేయండి’ అంటూ విజ్ఞప్తి చేశారు.
మా ఇంటికి ఎవరు రావాలో మీరెలా నిర్ణయిస్తారు?
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన ఇంటి బయట ఉన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను అభిజీత్ దీప్కే నిలదీస్తున్న వీడియో వైరల్ అయ్యింది. తన ఇంటికి వస్తున్న సందర్శకుల పట్ల ఆ ఎస్ఐ ప్రవర్తనపై ఆయన అభ్యంతరం చెబుతూ తన ఇంటి బయట పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘