Vijay- Sangeetha | తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలైన విడాకుల పిటిషన్‌ను సంగీత తాజాగా వెనక్కి తీసుకోవడంతో తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత.. ఇకపై ఈ కేసును కొనసాగించబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో విజయ్ అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. అసలు విజయ్-సంగీత మళ్లీ ఒక్కటయ్యారా? అందుకే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
గతంలో విజయ్ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, విజయ్ మరో హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారంటూ ఆమె ఆరోపించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి జీవించడం సాధ్యం కాదని సంగీత పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. భారీ మొత్తంలో భరణం కూడా కోరినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో అసలు ఏం జరిగిందనే ఆసక్తి నెలకొంది. గతంలో వచ్చిన ఆరోపణలు నిజం కాదా? లేక విజయ్-సంగీత మధ్య విభేదాలు తొలగిపోయాయా? ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారా? అనే చర్చ మొదలైంది.
అయితే తాజాగా వినిపిస్తున్న మరో వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సంగీత, విజయ్‌తో తిరిగి కలిసి జీవించేందుకు కేసును వెనక్కి తీసుకోలేదని, కేవలం ఈ వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా ముగించేందుకే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కుటుంబ గౌరవం, రాజకీయ ప్రతిష్ఠ దృష్ట్యా ఈ వ్యక్తిగత వ్యవహారం మరింత బహిరంగ చర్చకు దారితీయకుండా చూడాలని కుటుంబ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీగల్‌గా విడాకుల ప్రక్రియను కొనసాగించకుండా, కుటుంబ స్థాయిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని సంగీతను ఒప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్‌పై వ్యక్తిగత వివాదం ప్రభావం చూపకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అసలు కారణం ఏమిటన్నది ఆమె కానీ, విజయ్ కానీ అధికారికంగా వెల్లడించలేదు.