హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గురుకుల భవనాలకు సం బంధించిన నెలవారీ అద్దెలను పెం చాలని ప్రతిపాదనలు పంపొద్దని ప్రి న్సిపాల్స్ను ఎస్సీ గురుకుల సొసైటీ ఆ దేశించింది. జోనల్ ఆఫీసర్లకు సొసైటీ కార్యదర్శి శారద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని పలు గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు అద్దె భవనాల్లో కొనసాగుతు న్నాయి. కిరాయిలను లోకల్ లెవల్ అసెస్మెంట్ కమిటీల ద్వారా ఆయా ప్రాంతాలవారీగా గతంలో నిర్ధారించా రు.
గ్రామీణ ప్రాంతాల్లో స్కేర్ ఫీట్ రూ.8-14 చొప్పున, పట్టణ ప్రాంతా ల్లో రూ.12-20వరకు, హైదరాబాద్ పరిధిలోకి ఇంకా కొంచెం ఎక్కువగా నిర్ణయించా రు. సగటున ఒక్కో హాస్టల్ బిల్డింగ్కు నెలవారీగా కనిష్ఠంగా రూ. 2.50లక్షల నుంచి గరిష్ఠంగా రూ.14ల క్షల వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. అయితే భవన యజమానులు కొన్నేం డ్లుగా అద్దెలు పెంచాలని కోరుతున్నారు.
లేదంటే భవనాలు ఖాళీ చేయాలని ప్రిన్సిపాల్స్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో అద్దె భవనాల కిరాయి పెంచాల ని కోరుతూ ప్రిన్సిపాల్స్ జోనల్ ఆఫీస ర్లు, వారు సొసైటీ ఉన్నతాధికారులకు పదే పదే ప్రతిపాదనలు పంపుతు న్నా రు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదన లు సమర్పించారు. ప్రతిపాదనలపై తా జాగా ప్రభుత్వం స్పందించింది. అద్దెలు పెంచేది లేదని తేల్చి చెప్పింది. ఆయా ప్రాంతాలవారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరోసారి భవన అద్దెలు నిర్ధారించాలని సొసైటీకి స్పష్టం చేసింది.