KTR | సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా సంస్థ అంశంలో రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడని.. 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
రాజకీయ నాటకం మాత్రమే..
కాగా రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్ స్పందిస్తూ.. తాను లై డిటెక్టర్ పరీక్షతోపాటు సీఐడీ విచారణకు సిద్ధం.. మరి రేవంత్ రెడ్డి తన కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి.. లేదంటే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. గ్లోబరీనా సంస్థ నిజంగానే నా బినామీ సంస్థే అయితే అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం. రాజ్ భవన్ ధర్నా ముందు చేయాల్సిన కొడంగల్లో చేయడం రాజకీయ నాటకం మాత్రమేనన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించరు, రేవంత్ రెడ్డి మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని అన్నారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసిన కేటీఆర్
గ్లోబరీనా సంస్థ అంశంలో రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎలాంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడు
48 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్… https://t.co/jX4kSgSOsG pic.twitter.com/Ax0wZkBmRp
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు