IND vs ZIM : తొలి టీ20లో భారత పేసర్ల ధాటికి జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇటీవలే బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆతిథ్య జట్టుకు మయాంక్ యాదవ్(2-18), ప్రిన్స్ యాదవ్(2-19)లు చుక్కలు చూపించారు. టాపార్డర్ కుప్పకూలిన చోట వెస్లీ మధీవెరె(39), మరుమణి(27 నాటౌట్), రియాన్ బురీ(26)ల పోరాటంతో ఆతిథ్య జట్టు గట్టెక్కింది. ఈ ముగ్గురి మెరుపులతో టీమిండియాకు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది సికిందర్ రజా బృందం.
స్వదేశంలో బంగ్లాదేశ్‌పై టెస్టు, టీ20 విజయాలతో జోరు మీదున్న జింబాబ్వేకు భారత బౌలర్లకు తలొగ్గింది. తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు మయాంక్ యాదవ్(2-18). దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసిన మయాంక్ మొదటి ఓవర్లోనే డేంజర్ బ్రియాన్ బెన్నెట్(0)ను సున్నాకే ఔట్ చేశాడు.. అదే ఊపులో మోర్స్‌ను డగౌట్ చేర్చాడు.
Innings Break!
A clinical job with the ball from #TeamIndia 👏👏
The run chase is coming right up 🙌
Follow the match ▶️ https://t.co/NKa0znQQ3H#ZIMvIND pic.twitter.com/ywOMw3jndy
— BCCI (@BCCI) July 23, 2026
మయాంక్ విజృంభణతో జడుసుకున్న జింబాబ్వే పది ఓవర్లకే మరింత కష్టాల్లో పడింది. ప్రిన్స్ యాదవ్(2-19), సికిందర్ రజా(4)ను శివం దూబే ఔట్ చేయగా 32కే నాలుగు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. దాంతో, వంద లోపే చాపచుట్టేసిలా కనిపించిన రజా బృందాన్ని వెస్లీ మధీవెరె(39), రియాన్ బురి(26)లు ఆదుకున్నారు.
A disciplined effort from India’s bowlers! Zimbabwe finish with 125 pic.twitter.com/8jkJNLT6Ys
— Cricinfo (@cricinfo) July 23, 2026
అయితే.. మీడియం పేసర్ దూబేను టార్గెట్ చేసి వీరు బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. ఆఖర్లో మరుమణి(27 నాటౌట్) ధాటిగా ఆడడంతో ఆతిత్య జట్టు స్కోర్ వంద దాటింది. ఈ ముగ్గురు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ కొట్టింది.