Inspections | మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి
Inspections | ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల , కళాశాలను ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల (Minority Residential School ) , కళాశాలను ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్ ఆకస్మికంగా తనిఖీ ( Inspections ) చేశారు. గురుకులంలోని హాస్టల్, స్టాక్ రిజిస్టర్, ఆహార పట్టిక, ఆహార పదార్థాలు,తరగతి గదులు, మూత్రశాలలు,డార్మెటరీలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించు కుని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. నిరంతర కృషి ,పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, వసతి ఏర్పాట్లపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన విద్య అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట గురుకుల ప్రిన్సిపల్ సావిత్రి, ఉపాధ్యాయులు,వార్డెన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

