హైదరాబాద్ : హైటెక్ సిటీలోని కొహినూర్ ( అరో రియాలిటీ) గేటెడ్ కమ్యూనిటీ ( Kohinoor Gated Community) వినాయకుడి లడ్డూ ( Vinayaka Laddu ) రికార్డు ధర పలికింది. కిట్టీ కింగ్స్ ఏకంగా రూ.30,50,001 లకు మహా లడ్డూను సొంతం చేసుకున్నా రు. ఎంతో ఉత్సాహంగా సాగిన వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కోహినూర్ ఫెస్టివల్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వేలంలో ప్రసాదాలను, పలు వస్తువులను దక్కించుకున్న వారికి అభినందనలు తెలియజేశారు.
అందరి సహకారంతో ఏటా కోహినూర్ గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు.విజయ్ కృష్ణ నోట్ల మాలను రూ.3,35,000 లకు సొంతం చేసుకున్నారు. నాగ మల్లేశ్వర రావు రూ.3,20,000లకు పట్టు చీరను, హనుమంత రావు రూ.7,00,000కు కలశాన్ని, హరీందర్ సాహు రూ.4,21,000లకు పంచ కండువాను దక్కించుకున్నట్లు వివరించారు. కాగా హైదరాబాద్లో నిర్వహించిన లడ్డూ వేలాల్లో కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీ మూడో స్థానంలో నిలవడం విశేషం.