ప్రజాపాలనలో రక్తచరిత్ర!
తెలంగాణలో పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల హత్యలు జరుగుతున్నాయి. రాజకీయంగా అడ్డొస్తున్నాడని తెలిస్తే చాలు.. అధికారపార్టీ అండతో వేటాడి మరీ నరికేస్తున్నారు.
- పదేండ్లపాటు పచ్చగా ఉన్న తెలంగాణ
- రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు
- పట్టపగలు, నట్టనడిరేయి ప్రతిపక్ష నేతల హత్యలు
- రెక్కీలు చేసి చంపుతున్నా.. స్పందించని రేవంత్ ప్రభుత్వం
- రెండున్నరేండ్లలో 6 వరకు రాజకీయ హత్యలు
- ఒక్క కేసులోనూ పూర్తిస్థాయి పురోగతి లేని వైనం
- ఇక బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు లెక్కేలేదు
కేసీఆర్ పాలనలో పదేండ్లు.. ఎటుచూసినా పచ్చని మాగాణంలా తెలంగాణ కనిపించేది. నీళ్లు పారే సెలయేళ్లు, మత్తళ్లు దుంకే చెరువులు, చేను సెలకల చిరునవ్వుల ఆ పాలన మారిందో లేదో.. ప్రజాపాలన పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుబోసుకున్నాయి. పచ్చని తెలంగాణలో ప్రతిపక్ష నేతల నెత్తురు పారుతున్నది. అధికారపార్టీ నేతల దాడులతో బీఆర్ఎస్ కార్యకర్తల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రక్త చరిత్రను తలపిస్తున్నాయి.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల హత్యలు జరుగుతున్నాయి. రాజకీయంగా అడ్డొస్తున్నాడని తెలిస్తే చాలు.. అధికారపార్టీ అండతో వేటాడి మరీ నరికేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన వారాల వ్యవధిలోనే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు నుంచే మొదటి రాజకీయ హత్య నమోదైంది. కొన్నేండ్లపాటు దేశానికి జవాన్‌గా సేవ చేసి, బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన మల్లేశ్ యాదవ్‌ను 2023 డిసెంబర్ 28న హత్య చేశారు. 2024 మే 23న అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డిని గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. 2024 జూన్ 2న ఖమ్మంలో భూతగాదాల సాకుతో రఘునాథపాలెం మండలం శివాయిగూడెనికి చెందిన ఈర్యనాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు.
సూర్యాపేట నుంచే దాడుల పరంపర..
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం సొంత జిల్లా నుంచే హత్యలు మొదలు పెడితే.. సూర్యాపేట జిల్లా నుంచి ఫ్యాక్షన్ దాడులకు తెరలేపారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి, కాసర్లపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగులగొట్టారు. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలోనూ కావాలనే కాంగ్రెస్ నేతలు గొడవకు తెరలేపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటరూరల్ మండలం దుబ్బతండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కిరణ్‌పై అదే తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండివేట్‌లో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భీమ్‌దాస్.. హైమద్, రజాక్, జావేద్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడి చేశాడు.
మధు హత్యకు గురవుతాడని పోలీసులకు ముందే తెలుసు..
తాజాగా సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మధు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యారాజకీయాలకు ఆ మరణం మరొక సజీవ సాక్ష్యంగా నిలిచింది. 2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నాడనే నెపంతో.. కోర్టులో ఆ సాక్ష్యం లేకుండా చేసేందుకు అతి కిరాతకంగా మధును కాంగ్రెస్ నాయకులే హత్య చేశారు. రాజకీయ ప్రత్యర్థులు చంపేస్తారనే సమాచారం పోలీసులకు ఉన్నా అతన్ని కాపాడటంలో నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘పోలీసు అధికారే స్వయంగా మధును పిలిచి.. త్వరలో నువ్ ఎగిరిపోతావ్ అని బెదిరించాడు’ అని జగదీశ్‌రెడ్డి చెప్పడమే కాంగ్రెస్ ఆగడాలకు పోలీసుల బలం ఎంత ఉందనేది స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్పై ఎంత పగ ఉంటే.. ముక్కలు ముక్కలుగా నరికి చంపి, గోనె సంచిలో వేసి ఎస్సారెస్పీ కాలువలో పడేసి ఉంటారని రాష్ట్రమంతా చర్చించుకున్నారు.
కారుతో ఢీకొట్టించి మరీ హత్య
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణలపై కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్న అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ను తెల్లవారుజామునే కారుతో గుద్ది కాంగ్రెస్ నాయకులే హత్య చేసినట్టు బాధిత కుటుంబం చెబుతున్నది. శనివారం ఉదయం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతమాసబ్ట్యాంక్ పరిధిలో ఉదయం 5:45 గంటలకు మొయిజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా నంబర్‌ప్లేట్ లేని కారుతో ఢీకొట్టించి మరీ చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సంచలనంగా మారాయి. దీంతో న్యాయవాది హత్య కేసులో ప్రత్యేకంగా సిట్ వేయాలని డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. తమ ఆక్రమణలకు అడ్డొస్తున్నాడనే, అక్రమాలను నిలదీస్తున్నాడనే అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హత్య చేయించారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఫ్యాక్షన్ కల్చర్‌ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందనడానికి ఇవి సాక్ష్యాలు.
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ దాడులకు గురైన బాధితులు వీరే..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కడో ఓ చోట కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం కనిపిస్తూనే ఉంది. నాటి బీఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై ఎంపీ ఎన్నికల ప్రచారంలోనే కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్త హత్యాయత్నం చేశాడు. తృటిలో తప్పించుకున్న ప్రభాకర్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
- సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి, ఖమ్మంలో వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే అక్కడ కూడా హరీశ్‌రావు బృందంపై దాడి.
- హైడ్రా బాధితుల పక్షాన మాట్లాడేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకుని దాడికి యత్నించిన కాంగ్రెస్ గూండాలు.
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాన్వాయ్‌లతో వచ్చి మరీ దాడికి తెగబడ్డారు.
- పెద్దపల్లి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలోనే సల్వాజీ మాధవరావుపై నాలుగుసార్లు హత్యాహత్యానికి పాల్పడ్డారు. తనపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, తనను రక్షించాలని నెత్తుటి మరకలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎకిన సల్వాజీ మాధవరావుపైనే పోలీసులు ఉల్టా అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుపాలు చేశారు.
- రాజకీయ ప్రేరేపిత దాడుల్లో బాధితులైన వారిలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మొదట ఉన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా అర్పనపల్లి మండలం కాసర్లపహాడ్‌కు చెందిన మెండె సురేశ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం చల్లా హరి, దనియాకుల హన్మంతరావు, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు, రాత్లావత్ మంగమ్మ, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యారావు తదితరులు కూడా రాజకీయ ప్రేరేపిత దాడుల్లో బాధితులే.
- నల్లగొండలో బీఆర్ఎస్ నేతలు, రైతులు చేస్తున్న ధర్నాపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.
- మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీలో బీఆర్ఎస్ సర్పంచ్ వెంకటమ్మ భర్త పెద్ద వెంకన్నపై అకారణంగా దాడి. ఆ దాడిలో ఆంజనేయులు అనే బీఆర్ఎస్ కార్యకర్త తలకు గాయాలయ్యాయి.
- నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగవట్నంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శివ, బాలపీరు, రాముడు కారుపైకి రాళ్లు విసిరి, రాళ్ల దాడికి పాల్పడ్డారు.
- పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో పోలింగ్ ముందు రోజు రాత్రి కత్తిపోటుకు గురైన మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు గుజ్జుల పరమేశ్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.
- దేదినేనిపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్ (ఎంపీటీసీ భర్త) ఇంటిపై దాడి.
- నల్లగొండ మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ భర్త జేరిపోతుల భాసర్ గౌడ్, తన సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి స్థానిక మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఇంటి ముందు పటాకులు కాలుస్తూ హంగామా చేసి, చైర్మన్ తల్లిపై కూడా దాడి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

