e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి

చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి

చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి

దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలోని ఉప‌హార్ సినిమా థియేట‌ర్‌లో1997 లో స‌రిగ్గా ఇదే రోజున‌ అగ్నిప్ర‌మాదం సంభ‌వించి 59 మంది చ‌నిపోయారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగి నేటికి 24 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. దీనిపై విచారించిన కోర్టు బాధితుల‌కు రూ.18 కోట్ల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశిస్తూ 12 మందికి రెండేండ్ల జైలు శిక్ష విధించింది.

‘బోర్డర్’ చిత్రం ఢిల్లీలోని ఉప‌హార్ సినిమా థియేట‌ర్‌తోపాటు దేశ‌వ్యాప్తంగా విడుదలైంది. సాయంత్రం ప్రదర్శనకు సినిమా హాల్ నిండిపోయింది. స‌గం సినిమా పూర్తవుతున్న స‌మ‌యంలో సినిమా హాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. మంటలు హాల్ మొత్తాన్ని ముంచెత్తాయి. కొందరు కాలిన గాయాలతో, మరికొందరు ఊపిరి ఆడకుండా మరణించారు. ఈ ప్రమాదంలో 59 మంది ప్రాణాలు విడ‌వ‌గా.. 100 మందికి పైగా గాయపడ్డారు. హాల్ పార్కింగ్ స్థలంలో ఉంచిన కార్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఆ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు తొలుత మంట‌లు చెల‌రేగ‌గా అదుపులోకి తెచ్చారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ట్రాన్స్‌ఫార్మ‌ర్ మ‌ర‌మ్మ‌తులు పూర్తిచేశారు. అయితే, ఆయిల్ లీకేజీల‌ను అక్క‌డి సిబ్బంది ప‌ట్టించుకోలేదు. ఒక్క‌సారిగా ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేల‌డం, మంట‌లు వ్యాపించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

- Advertisement -

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఉపహార్ సినిమా థియేట‌ర్‌ యజమాని సుశీల్ అన్సాల్, అతని కుమారుడు ప్రణవ్ అన్సల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. మొత్తం 16 మందిపై సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితులకు రూ.18 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2003 లో కోర్టు ఆదేశించింది. 2007 లో సుశీల్, గోపాల్ అన్సాల్ సహా 12 మంది నిందితులను కోర్టు దోషిగా నిర్ధారించి అందరికీ రెండేండ్ల‌ జైలు శిక్ష విధించింది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2012: ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హసన్ కన్నుమూత‌

2005: లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డిన మైఖేల్ జాక్సన్

1998: రాష్ట్రీయ‌ జనతాదళ్ నాయకుడు బ్రిజ్ బిహారీ ప్రసాద్ బిహార్‌లో దారుణ‌హత్య

1993: కెనడాకు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన కిమ్ కాంప్‌బెల్

1971: ప్రపంచం ముందు రావ‌డం ప్రారంభ‌మైన ‘పెంటగాన్ పేపర్స్’

1956: సూయజ్ కాలువ నియంత్రణను 75 సంవత్సరాల తర్వాత ఈజిప్టుకు అప్పగించిన బ్రిట‌న్‌

1325: సౌదీ అరేబియాలోని మక్కాకు తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన ఇబ్న్ బటుటా

ఇవి కూడా చ‌ద‌వండి..

యూపీ విభ‌జ‌న : యోగీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అందుకేనా..?

క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!

హార్ట్ రిథ‌మ్ : క‌రోనా కార‌ణంగా అరిథ్మియాకు అవ‌కాశాలు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి
చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి
చ‌రిత్ర‌లో ఈరోజు : ఉప‌హార్‌ అగ్నిప్ర‌మాదంలో 59 మంది మృతి

ట్రెండింగ్‌

Advertisement