శంషాబాద్ రూరల్, మే 29 : శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టూ 20 కిలోమీటర్ల దూరం వరకు భవనాల ఎత్తు నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం శంషాబాద్ పట్టణంలో ఓ భవన నిర్మాణదారుడికి నోటీసులు అందజేశారు.
విమానాశ్రయానికి చుట్టూ 20 కిలోమీటర్ల దూరం వరకు భవన నిర్మాణం ఎత్తు నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం భవన నిర్మాణదారులు ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి ఎన్వోసీ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15 రోజుల్లో ఎన్వోసీ వస్తుందని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు.