రంగారెడ్డి, మే 29 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొహెడ గ్రామంలో ప్రతిపాదిత ప్రూట్ మార్కెట్ నిర్మా ణం నేపథ్యంలో భూములు కోల్పోనున్న బాధిత రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతోపాటు కలెక్టర్‌ను కలిసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..
గత ప్రభుత్వం బాటసింగారం పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని రేవంత్ సర్కార్ పక్కనబెట్టి ప్రస్తుతం సర్వేనంబర్ 167/1లో సుమారు 179 ఎకరాల స్థలాన్ని తీసుకుంటున్న సందర్భంగా.. ఆ భూములను తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తు న్న సుమారు 160 మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉం చుకుని నష్టపరిహారాన్ని అందించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. అదేవిధంగా వచ్చేనెల మూడో తేదీన పండ్ల మార్కెట్‌కు శం కుస్థాపన జరుగనున్నట్టు సమాచారం ఉన్నందున.. ఆ తేదీలోపే పేద రైతుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.