అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్‌తో 168 ఎలుకలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో నిలువ వుంచిన శుక్రకణాలతో విజయవంతంగా ఎలుకలను పుట్టించారు.

వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో నిలువ వుంచిన శుక్రకణాలతో విజయవంతంగా ఎలుకలను పుట్టించారు. ఎలుకల స్పెర్మ్‌ను ఆరేండ్లపాటు అంతరిక్ష కేంద్రంలో ఫ్రీజ్-డ్రైడ్ రూపంలో నిలువ వుంచారు. ఆరు సంవత్సరాలపాటు అధిక స్థాయిలో కాస్మిక్ రేడియేషన్‌కు గురైన ఎలుకల స్పెర్మ్ ఆరోగ్యకరమైన ఎలుక పిల్లలకు జన్మనిచ్చేందుకు ఉపయోగపడిందని దీనిపై పరిశోధన చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయనం విషయాలు సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. వీటి పుట్టుకలో ఎలాంటి మ్యుటేషన్ లేదా జన్యుపరమైన లోపాలు కనిపించలేదని వారు తెలిపారు.
ఎలుక పిల్లలు అంతరిక్షంలో పుట్టలేదు. ఐఎస్ఎస్లో నిలువ వుంచిన స్పెర్మ్‌ను అంతరిక్షం నుంచి భూమికి తీసుకువచ్చి.. రీహైడ్రేట్ చేసిన తర్వాత దాని ఫలితంగా 168 పిల్లలు పుట్టాయి. అంతరిక్ష స్పెర్మ్, భూమిపై మిగిలి ఉన్న స్పెర్మ్ ద్వారా ఫెర్టిలైజ్ చేయబడిన ఎలుకల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉన్నదని అభివృద్ధి జీవశాస్త్రవేత్త, అధ్యయనం ప్రధాన రచయిత తెరుహికో వాకాయామా తెలిపారు. వాకాయామా, అతని పరిశోధకుల బృందం జపాన్ నుంచి మూడు పెట్టెలను ఐఎస్ఎస్కు పంపిన తర్వాత ఈ అధ్యయనం ప్రారంభించారు. పెట్టెల్లో ఫ్రీజ్-డ్రైడ్ స్పెర్మ్ 48 ఆంపూల్స్ అంతరిక్షంలోకి పంపించారు. ఈ ఆంపూల్స్ బ్యాచ్‌లుగా భూమికి తిరిగి వచ్చాయి. వీటిలో మొదటిది 9 నెలల తర్వాత, తర్వాత బ్యాచ్ రెండు సంవత్సరాలకు, చివరి బ్యాచ్ ఆరేండ్ల తర్వాత భూమ్మీదకు వచ్చాయి.
అంతరిక్షంలో దీర్ఘకాలంపాటు రేడియేషన్‌కు గురికావడం వల్ల ఎలుకల పునరుత్పత్తి కణాల్లో డీఎన్ఏ ఏమేర దెబ్బతింటుంది..? సంతానానికి మ్యుటేషన్లను పంపించగలదా? అనేది తెలుసుకోవడం ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం.
ఇవి కూడా చదవండి..
కెఫిన్ అధిక వినియోగంతో గ్లకోమా సమస్య
కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ : ఆంటోనియా గుటెర్రెస్
తొలి ప్రవేశం : భద్రతా మండలిలో అల్బేనియాకు తాత్కాలిక సభ్యత్వం
చర్చలు షురూ: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

