కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ : ఆంటోనియా గుటెర్రెస్
కరోనా మహమ్మారి అనేక దేశాల్లో కార్చిచ్చులా వ్యాపిస్తున్నదని ఐక్యారాజ్యసమతి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారం వ్యక్తం చేశారు. దీనిని నివారించడానికి వ్యాక్సిన్ మినహా మరో మార్గం లేనందున వ్యాక్సిన్ను ప్రజా ప్రయోజనంగా చూడాలని పిలుపునిచ్చారు

లండన్ : కరోనా మహమ్మారి అనేక దేశాల్లో కార్చిచ్చులా వ్యాపిస్తున్నదని ఐక్యారాజ్యసమతి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విచారం వ్యక్తం చేశారు. దీనిని నివారించడానికి వ్యాక్సిన్ మినహా మరో మార్గం లేనందున వ్యాక్సిన్ను ప్రజా ప్రయోజనంగా చూడాలని పిలుపునిచ్చారు. జీ -7 దేశాల సమావేశం అనంతరం ఆయన వర్చువల్గా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో కొనసాగుతున్న అసమానతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. అటువంటి పరిస్థితిలో వ్యాక్సిన్ను అన్ని దేశాలకు సమానంగా పంపిణీ చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. వ్యాక్సిన్లను ప్రపంచదేశాలన్నింటిలో అందుబాటులో ఉంచినప్పుడే ఈ మహమ్మారిని అంతం చేయవచ్చునన్నారు. జీ -7 దేశాల సమావేశంలో కరోనా మహమ్మారి సమయంలో పేద దేశాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం 50 బిలియన్ డాలర్ల ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం పట్ల ఆంటోనియా గుటెర్రెస్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గుటెర్రెస్ చెప్పారు. దీనిని అంతం చేయడానికి ప్రపంచ టీకాల ప్రణాళికను సాకారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
తొలి ప్రవేశం : భద్రతా మండలిలో అల్బేనియాకు తాత్కాలిక సభ్యత్వం
చర్చలు షురూ: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

