కెఫిన్ అధిక వినియోగంతో గ్లకోమా సమస్య
టీ, కాఫీ, ఇతర ఎనర్జీ డ్రింక్స్‌లలో లభించే కెఫిన్.. కంటి వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఈ అధ్యయనం ఆధారంగా చాలా ఎక్కువ మొత్తంలో కెఫిన్ వాడటం వల్ల గ్లకోమా ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వాషింగ్టన్ : పనుల్లో అలిసి పోయిన మనం అలసటను దూరం చేసుకునేందుకు మనలో చాలా మంది కాఫీ, టీ తీసుకుంటుంటాం. కాఫీ, టీ తీసుకోగానే శక్తిని పొంది మళ్లీ పనుల్లో నిమగ్నమవుతుంటాం. వాస్తవానికి టీ, కాఫీ, ఇతర ఎనర్జీ డ్రింక్స్‌లలో లభించే కెఫిన్.. కంటి వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఈ అధ్యయనం ఆధారంగా చాలా ఎక్కువ మొత్తంలో కెఫిన్ వాడటం వల్ల గ్లకోమా ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనం ఫలితాలు ఆప్తాల్మాలజీ పత్రికలో ప్రచురించారు.
న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్‌లోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల నేతృత్వంలో జరిపిన ఈ పరిశోధనలో గ్లకోమా వచ్చే ప్రమాదం ఉన్న ఆహారం, జన్యుశాస్త్రాలను తొలిసారిగా పరిశీలించారు. ఈ అధ్యయనం ఆధారంగా గ్లకోమా కుటుంబ చరిత్ర ఉన్న రోగులు వారి కెఫిన్ వాడకాన్ని తగ్గించాలని పరిశోధకులు సూచించారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యూకే బయోబ్యాంక్‌లో ఉన్న లక్ష 20 వేల మంది డాటాను విశ్లేషించారు. ఈ డాటా 2006 నుంచి 2010 వరకు, 39 నుంచి 73 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ వ్యక్తుల ఆరోగ్యంతో పాటు డీఎన్ఏ నమూనాలు కూడా డాటాలో లభించాయి.
మౌంట్ సినాయ్ హెల్త్ సిస్టం ఆప్తాల్మాలజీ పరిశోధన డిప్యూటీ చీఫ్ లూయిస్ ఆర్. పాస్క్వెల్ ప్రకారం, గత అధ్యయనాల్లో అధిక కెఫిన్ వాడకం ఒత్తిడిని పెంచుతుందని గుర్తించారు. కుటుంబంలో ఎవరైనా గ్లకోమా కలిగి ఉంటే, కెఫిన్ మరింత ప్రమాదాన్ని పెంచుతుంది. వీరి అధ్యయనం ప్రకారం, అధిక కెఫిన్ తీసుకోవడం అంటే.. రోజుకు 480 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ. రోజుకు 321 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల జన్యుపరంగా ఎక్కువ అవకాశం ఉన్న వారితో పోలిస్తే సాధారణ ప్రజల్లో గ్లకోమా ప్రమాదాన్ని 3.9 రెట్లు పెంచుతుంది.
ఇవి కూడా చదవండి..
కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ : ఆంటోనియా గుటెర్రెస్
తొలి ప్రవేశం : భద్రతా మండలిలో అల్బేనియాకు తాత్కాలిక సభ్యత్వం
చర్చలు షురూ: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

