Trikaala | భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన, ఇప్పటివరకు వెండితెరపై ఎవరూ తాకని ఆధ్యాత్మిక రహస్యాల ఆధారంగా సరికొత్త మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా ‘త్రికాల’ (Script of God) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ అందిస్తూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 28న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రపంచంపై చీకటి కమ్ముకునే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ఒక వెలుగులా అవతరించే శక్తి చుట్టూ ఈ త్రికాల కథ తిరుగుతుందని, ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను మలిచామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా కంటెంట్ మరియు అవుట్‌పుట్ బాగా నచ్చడంతో చాగంటి ప్రొడక్షన్ LLP సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా దాస్‌తో పాటు మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని, ఐశ్వర్య రాజ్ భకుని కీలక పాత్రల్లో నటించారు. ‘మంగళవారం’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. సస్పెన్స్, మైథాలజీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్లో ‘త్రికాల’ ఒక అద్భుతమైన ఛాయిస్ కానుంది.