e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్‌

అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్‌

న్యూఢిల్లీ : ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు మ‌రింత నైపుణ్య‌త చేకూర్చేందుకు అమెజాన్ ఇండియా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ది. అప్లైడ్ మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ (ఎంఎల్) నేర్చుకోవడానికి ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలో ఉద్యోగాలు సంపాదించడానికి సహాయపడటం ఈ కార్య‌క్ర‌మం ముఖ్యోద్దేశం అని తెలిపింది. దీని ద్వారా భవిష్యత్‌లో నైపుణ్యాల కోసం పెరుగుతున్న డిమాండ్ నెరవేరుతుందని అమెజాన్ ఇండియా భావిస్తున్న‌ది.

ఎంఎల్ సమ్మర్ స్కూల్ అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ద్వారా జరుగుతుంది. 2021 లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ ఢిల్లీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) బొంబాయి, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తిరుచిరాపల్లి, అన్నా యూనివ‌ర్శిటీ సాంకేతిక ప్రాంగణాల యూజీ, పీజీ లేదా పీహెచ్‌డీ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు డీప్ లెర్నింగ్, ప్రాబబిలిస్టిక్ గ్రాఫికల్ మోడల్స్ వంటి ఉన్నత స్థాయి ఎంఎల్ టెక్నాలజీలను నేర్చుకుంటారు. దీని ద్వారా ఈ-కామర్స్, డిమాండ్ అంచనా, క్యాటలాగ్ నాణ్యత, ఉత్పత్తి సిఫార్సులు, ఆన్‌లైన్ ప్రకటనల వంటి డొమైన్ నిర్దిష్ట వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించ‌డం నేర్చుకుంటారు.

ద‌రఖాస్తు చేయ‌డం ఇలా..

- Advertisement -

ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు amazonmlsummerschoolindia.splashthat.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అమెజాన్ రీసెర్చ్ డేస్ (ఏఆర్డీ) సమావేశానికి అభ్యర్థులకు ఆక్సెస్ ఉంటుంది, ఇక్కడ వారు ప్రపంచంలోని ప్రఖ్యాత ఎంఎల్ లీడ‌ర్‌ ప్రెజెంటేషన్ల సాయంతో పరిశ్రమలోని సాంకేతిక పోకడల గురించి తెలుసుకునే వీలుంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

క్లాట్ 2021 : ప‌రీక్ష తేదీని ప్ర‌క‌టించిన క‌న్సార్టియం

ఏనుగుల దాడి : జైలులో గ్రామ‌స్థుల బ‌స‌

కొత్త‌ అలారం : 15 నిమిషాల్లో క‌రోనా గుర్తింపు..!

గైర్హాజ‌రు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం

చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement