కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
కరోనా వైరస్‌ను గుర్తించడం ఇక మరింత తేలిక కానున్నది. కరోనా వైరస్‌ను తక్కువ సమయంలో గుర్తించే అలారంను బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు

లండన్ : కరోనా వైరస్‌ను గుర్తించడం ఇక మరింత తేలిక కానున్నది. కరోనా వైరస్‌ను తక్కువ సమయంలో గుర్తించే అలారంను బ్రిటిష్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ అలారంకు కొవిడ్ అలారం అని పేరు పెట్టారు. ఈ అలారం గదిలో ఉండే వారిలో కొవిడ్‌తో బాధపడుతున్నవారిని కేవలం 15 నిమిషాల్లో ఇట్టే గుర్తిస్తుంది. పెద్ద గది అయితే 30 నిమిషాల సమయం తీసుకుంటుందని, ఇది ఆర్టీ-పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల కంటే ఖచ్చితమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ అలారం అందుబాటులోకి వస్తే కరోనా సోకిన వారి గురించి సమాచారం పొందేందుకు విమాన క్యాబిన్లు, తరగతి గదులు, సంరక్షణ కేంద్రాలు, గృహాలు, కార్యాలయాలలో ఈజీగా స్క్రీనింగ్ చేపట్టవచ్చు. ఈ పరికరం పొగ అలారం కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ పరిశోధన ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్ఎస్హెచ్టీఎం), డర్హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరికరం ద్వారా ఫలితాల ఖచ్చితత్వ స్థాయి 98-100 శాతం వరకు ఉంటుందని పరీక్షల సమయంలో శాస్త్రవేత్తలు నిరూపించారు.
కరోనా సోకిన వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించకపోయినా, కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తులను ఈ డిటెక్టర్ కనిపెడుతుంది. ఇతర అంటువ్యాధుల గుర్తింపులో కూడా ఈ అలారం ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వైరస్ సోకిన వారిని గుర్తించిన తర్వాత ఈ యంత్రం ఆథరైజ్డ్ వ్యక్తికి సందేశాన్ని పంపుతుంది. రోబో సైంటిఫిక్ గా నిర్మితమైన ఈ పరికరం చర్మం, శ్వాస ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయనాలను గుర్తించడం ద్వారా వైరస్ సోకిన వారిని గుర్తిస్తుంది. వైరస్ కారణంగా అస్థిర సేంద్రియ సమ్మేళనాలు మారి శరీర వాసనలను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాసనలను పరికరంలోని సెన్సార్లు గుర్తించి సమాచారాన్ని అధీకృత వ్యక్తికి సందేశం ద్వారా పంపుతుంది. ఈ పరికరం ధర దాదాపు రూ.5.15 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్‌కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

