e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దులో గ‌ల్వాన్ లోయ‌లో భార‌త‌దేశం-చైనా సైనికుల మ‌ధ్య భీక‌ర‌పోరు గ‌త ఏడాది స‌రిగ్గా ఇదే రోజున జ‌రిగింది. ఈ పోరులో భార‌తదేశానికి చెందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది అమ‌రుల‌య్యారు. చైనా సైనికుల‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన భార‌త జ‌వాన్ల పోరు ఊరికే పోలేదు. మ‌న భార‌త భూభాగం నుంచి ఇంచు ప్రాంతాన్ని కూడా ఇత‌రుల‌కు వ‌దిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుండి చైనా సైన్యం ఇంటి ముఖం ప‌ట్టేలా చేయ‌గ‌లిగారు. ఈ ఘ‌ట‌న‌లో చైనాకు చెందిన 25-40 మంది జ‌వాన్లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ ఆ దేశం ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తూర్పు లడ‌ఖ్‌​లోని పాంగాంగ్ ట్సో సరస్సు వ‌ద్ద‌ ఇరుదేశాల సైన్యం మధ్య రక్తపాతం చోటు చేసుకుంది. వాస్తవాధీన రేఖ విషయంలో తొలుత‌ వివాదం మొదలైంది. క్రమంగా పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తన పట్టును పెంచుకుంటూ వచ్చి సైన్యాన్ని అధికంగా మోహరించింది. పాంగాంగ్ సరస్సు చుట్టూ 100 గుడారాలను నిర్మించింది. ఈ నేపథ్యంలో చైనా గుడారాలను తొల‌గించేందుకు కర్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని బిహార్ రెజిమెంట్.. గల్వాన్ లోయలోని చైనా స్థావరం వైపు క‌దిలింది. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య భౌతిక ఘర్షణ చెల‌రేగింది. ఇనుప రాడ్లు, మేకులు దించిన చువ్వలతో చైనా సైనికులు కర్నల్ సంతోష్ బాబు బృందంపై దాడి చేశారు. వీరిని సంతోష్ బాబు బృందం దీటుగా ఎదుర్కొన్న‌ది. దాంతో చైనా సైన్యం తోక‌ముడవ‌క త‌ప్ప‌లేదు.

- Advertisement -

గత నాలుగు దశాబ్దాల్లో రెండు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు ఎప్పుడూ చోటుచేసుకోలేదు. ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి అనేక విడతలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఘర్షణలు జరిగిన పది నెలల తర్వాత.. ప్యాంగ్యాంగ్ సో సరస్సు దగ్గర రెండు వైపులా యుద్ధ ట్యాంకులు, బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు కనిపించాయి.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2014: ప్రధానిగా నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన

2012: ఒక తాడుపై నయాగర జలపాతం దాటిన‌ మొదటి వ్యక్తిగా నిలిచిన నిక్ వాలెండా

2005: సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించిన భారత పార్లమెంట్

1991: భార‌త‌దేశం ప్ర‌ధానమంత్రిగా పీవీ నరసింహారావు ఎన్నిక‌

1971: బ్రిటన్‌లో పాఠశాలల్లో పిల్లలకు ఉచిత పాలను నిషేధించిన మార్గ‌రేట్ థాచ‌ర్‌

1954: యూరప్‌లోని వివిధ దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్ల సంస్థ అయిన యూఈఎఫ్ఏ ఏర్పాటు

1947: దేశ విభ‌జ‌న‌కు సంబంధించి మౌంట్ బాటన్ ప్రణాళికను ఆమోదించిన‌ కాంగ్రెస్

1908: కోల్‌క‌తా స్టాక్ ఎక్స్ఛేంజ్ అసోసియేషన్ స్థాపన

ఇవి కూడా చ‌ద‌వండి..

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

ప్రోటీన్ వ‌న‌రు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్త‌మం

బ‌హు భార్య‌త్వానికి మ‌ద్ద‌తు.. లా ప్రొఫెస‌ర్‌కు ఇక్క‌ట్లు

ఆంక్ష‌ల పొడ‌గింపు : బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న డెల్టా వేరియంట్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం
చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం
చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

ట్రెండింగ్‌

Advertisement