Lucknow | వరకట్న వేధింపులు.. అత్తారింట్లో అనుమానాస్పదంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి
Lucknow : త్విషా శర్మ ఘటన మరువక ముందే మరో మహిళ వరకట్న వేధింపులు, అత్తవారింటి హింసకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక యువతి అత్తారింట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె పేరు మాన్సి. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
Lucknow : త్విషా శర్మ ఘటన మరువక ముందే మరో మహిళ వరకట్న వేధింపులు, అత్తవారింటి హింసకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక యువతి అత్తారింట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆమె పేరు మాన్సి. తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెను భర్త, అతడి కుటుంబ సభ్యులే చంపి ఉంటారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాన్పూర్‌కు చెందిన మాన్సికి, లక్నోకు చెందిన సాగర్ రాజ్‌పుత్ అనే వ్యక్తితో 2024లో వివాహం జరిగింది.
ఈ పెళ్లి సందర్బంగా వరకట్నం కింద రూ.7 లక్షల నగదుతోపాటు, గృహోపకరణాలు, ఆభరణాలు వంటివి ఇచ్చారు. అయితే, ఇది చాలని మాన్సి భర్త, అతడి కుటుంబం అదనపు వరకట్నం కోసం వేధించింది. పెళ్లైనప్పటి నుంచి అదనంగా డబ్బు తేవాలని, కార్ కొనివ్వాలని కూడా మాన్సిని వేధించారు. శారీరకంగా హింసకు గురిచేయడంతోపాటు అందరిముందు పలుమార్లు అవమానించారని మాన్సి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయం గురించి చెప్పి, మాన్సి అనేకసార్లు ఆవేదని చెందిందని ఆమె కుటుంబం వెల్లడించింది. అంతేకాదు.. ఈ అంశంపై సర్ది చెప్పేందుకు అనేకసార్లు తాము లక్నో వెళ్లొచ్చినట్లు చెప్పారు. శనివారం మాన్సి ఆత్మహత్య చేసుకని మరణించిందని తమకు భర్త కుటుంబ సభ్యుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు.
వాళ్లే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మాన్సి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు భరత్ సాగర్ రాజ్‌పుత్‌తోపాటు అతడి మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాన్సి, సాగర్లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందులో భర్త సాగర్‌కు దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dowry
- influencer
- Lucknow
- Mansi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

