Sabitha Indra Reddy | తెలంగాణలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పరిధిలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (VOA) తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీవోఏల (VOA) గౌరవ వేతనాన్ని 8 వేలకు పెంచే నిర్ణయంలో కీలక పాత్ర పోషించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీవోఏల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. వీవోఏలను సెర్ప్ (SERP) ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్ (HR) పాలసీని అమలు చేయాలని, కనీస వేతనం 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం పక్కన 15వ రోజు దీక్షకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలను, గ్రామ దీపికలను (VOAలు) కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శిస్తూ, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాత్రింబగళ్లు శ్రమిస్తున్న వీఓఏలకు కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న మహిళా ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. వీఓఏల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ లోపల, వెలుపల బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పరిధిలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (VOA) తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు మద్దతుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
ఈ సందర్భంగా మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో… pic.twitter.com/42NI8XG1sj
— BRS Party (@BRSparty) June 1, 2026