Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..!
Viral News | రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Bengaluru) లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.
Viral News : రాజకీయ ప్రముఖులు (Politicians), వీవీఐపీల (VVIPs) కాన్వాయ్ రోడ్డుపై వెళ్లే సమయంలో భద్రతా కారణాల రీత్యా ఆ దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేయడం సహజం. దాంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతుంటారు. బెంగళూరు (Bengaluru) లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక (Karnataka) గవర్నర్ కాన్వాయ్ (Governors Convoy) ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్తుండటంతో పోలీసులు ఆ మార్గంలో దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను నిలిపిశారు. దాంతో ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గర్భవతిగా ఉన్న తన భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ట్రాఫిక్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ధర్నాకు దిగారు. గవర్నర్ కాన్వాయ్ వచ్చే మార్గంలో బైఠాయించారు. అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గం ఇప్పటికే రద్దీగా ఉందని, ఈ విధంగా గంటల తరబడి ట్రాఫిక్‌ను నిలిపివేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. తన భార్య గర్భవతి అని, అత్యవసర వైద్య పరిస్థితి కంటే వీఐపీ కాన్వాయ్‌లకే ప్రాధాన్యమిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్రాఫిక్ క్లియర్ చేసేవరకు రోడ్డుపై నుంచి కదలనని అతను కరాఖండిగా చెప్పడంతో పోలీసులు ఓ వైపు నుంచి వాహనాలను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీఐపీ కల్చర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘వీఐపీల సౌకర్యాలకు ఇచ్చే విలువ ప్రజల ప్రాణాలకు లేకుండా పోతోంది’ అంటూ మండిపడ్డారు.
Bengaluru Man Protests On Road After Governor’s Convoy Halts Traffic, Leaves Pregnant Wife Stuck pic.twitter.com/capYK85bo9
— NDTV (@ndtv) June 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

