Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు
అక్రమంగా మొరం మట్టి తరలిస్తు్న్నా అధికారులు పట్టించుకోవడం లేదని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మాగనూరు జూన్ 01: అక్రమంగా మొరం మట్టి తరలిస్తు్న్నా అధికారులు పట్టించుకోవడం లేదని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. నల్లగట్టు సమీపంలో అక్రమంగా మొరం మట్టి తవ్వకాలు జరిపి దాదాపు 5 నుంచి 10 ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సెలవు దినాలు అని చూడకుండా అధికారుల కనుసైగలోనే ఈ అక్రమ మట్టిదంద కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులు వివరణ కోరగా అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని అయితే ఈ విషయంపై ఎస్ఐ నవీదుకు మూడు రోజుల కిందటే సమాచారమిచ్చారన్నారు. ఇదే విషయంపై ఎస్సై నవీద్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. అయితే కృష్ణ మండలంలో అక్రమ ఇసుక మొరం దందాలు పోలీసులు, రెవెన్యూ అధికారుల కనుసైగల్లోనే కొనసాగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

