Highmast light | విశాఖపట్నం రైల్వే స్టేడియంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే పనులు జరుగుతుండగా హఠాత్తుగా గాలి వీసింది. తీవ్రమైన గాలుల ధాటికి స్టేడియంలో ఉన్న 50 అడుగుల హై-మాస్ట్ లైట్ కుప్పకూలింది. హై మాస్ట్ లైట్ ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ వైపు పడింది.
అయితే ఆ సమయంలో కింద కార్మికులెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్లు, ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే ఈ స్టేడియంలో ప్రమాదం చోటుచేసుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
విశాఖపట్నం రైల్వే స్టేడియంలో గాలి ఉధృతికి కుప్పకూలిన 50 అడుగుల హై-మాస్ట్ లైట్
ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ వైపు పడ్డ లైట్
స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జరుగుతుండగా ప్రమాదం
ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్మికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఫస్ట్-క్లాస్… pic.twitter.com/oUQNsy7JH5
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2026