కారేపల్లి, జూన్ 01 : ఈ నెలలో చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి పిలుపునిచ్చారు. సింగరేణి మండలంలో సోమవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా భాగ్యనగర్ తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే ఫెర్టిలైజర్ షాపును ఆమె ప్రారంభిచారు. అనంతరం సింగరేణి మండల మాజీ జడ్పీటీసీ వాంకోడొత్ జగన్ ఇంట్లో తేనీటి విందుకు హాజరయ్యారు. కారేపల్లిలో ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోముధుల నాగరాజు దగ్గరకు వెళ్లి పరామర్శించి ఆరోగ్యం పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా మైనారిటీ నాయకులు షేక్ గౌసద్దీన్ ఇంట్లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సింగరేణి మండలంలో త్వరలో చేపట్టబోయే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వాంకొడొత్ జగన్ నాయక్, నాయకులు డోకేన రవీందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, మాజీ సర్పంచులు సుజాత, జర్పాల హచ్చు, మోహన్, నాయకులు జడల కళ్యాణ్, ధారావత్ వికాస్, బానోత్ రాజేష్, మణికొండ నాగేశ్వరరావు, తెలగొల్లా రామారావు, గంగరబోయిన మురళి, పేర్ని వెంకటేశ్వర్లు, పొడుగు హరీష్, రమేష్, మూతి కోటేశ్వరరావు, అజ్మీరా రవి, వెంకట్, ఖలీల్ ఖాన్, సురేష్, వెంకట్ పాల్గొన్నారు.

‘సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులంతా భాగస్వామ్యులు కావాలి’