Shilpa Shetty | రిజర్వేషన్ల అంశంపై తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు పూర్తిగా అబద్ధమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నటి శిల్పా శెట్టి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తన పేరును ఉపయోగిస్తూ కొందరు కావాలని నిందలు వేస్తున్నారని, అది పూర్తిగా కల్పితమైన వార్త అని స్పష్టం చేశారు. నా పేరును ఉపయోగిస్తూ రిజర్వేషన్లపై వైరల్ అవుతున్న తప్పుడు ప్రకటనలు చూసి తీవ్ర షాక్‌కు గురయ్యాను. ఇది పూర్తిగా కల్పితం మరియు దుర్భుద్ధితో కూడిన చెత్త ప్రచారం. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మకండి అంటూ శిల్పా రాసుకోచ్చింది.
రిజర్వేషన్ వ్యవస్థను ఉద్దేశించి వైద్యులు, కులాల ఆధారంగా రోగులకు చికిత్స చేయాలంటూ శిల్పా శెట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినట్లుగా ఒక స్క్రీన్‌షాట్ నెట్టింట తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ వివాదం ముదరకముందే శిల్పా స్పందించి ఆ వార్తలకు తెరదించింది. ఇక సినిమాల విషయానికొస్తే, శిల్పా శెట్టి ఇటీవల ధ్రువ సర్జా, సంజయ్ దత్, రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కేడీ: ది డెవిల్’ అనే కన్నడ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘మా హై నా’ అనే ప్రముఖ రియాలిటీ కుకింగ్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
I am shocked to see fake statements on reservation falsely attached to my name. This is completely fabricated, malicious garbage.
Do not fall for this fake news!
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) July 28, 2026