e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News ఏనుగుల దాడి : జైలులో గ్రామ‌స్థుల బ‌స‌

ఏనుగుల దాడి : జైలులో గ్రామ‌స్థుల బ‌స‌

భానుప్ర‌తాప్‌పూర్ : ఏనుగుల దాడి నుంచి ర‌క్షించుకునేందుకు ఈ గ్రామ‌స్థులు ప్ర‌తి రోజు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. ఏనుగుల బారి నుంచి కాపాడుకునేందుకు నిర్మాణంలో ఉన్న‌ జైలును ఆశ్ర‌యించి రాత్రి పూట దానిలో త‌ల‌దాచుకుంటున్నారు. ఈ సంఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కాంక‌ర్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

కాంకర్‌లోని పిచ్చెట్టా గ్రామంలో ఏనుగులు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఆహారం కోసం అవి ఉండే దండ‌కార‌ణ్యం నుంచి స‌మీపంలోని పిచ్చెట్టా గ్రామంపై దాడి చేస్తున్నాయి. వీటి బారి నుంచి కాపాడాలంటూ ప‌లు మార్లు అధికారులకు మొర‌పెట్టుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. 300 మంది గ్రామస్తులు ఇప్పుడు ప్ర‌తి రోజు రాత్రి కొత్తగా నిర్మాణం చేప‌ట్టిన‌ జైలులో నిద్రిస్తూ ఏనుగుల బారి నుంచి ర‌క్షించుకుంటున్నారు. ఏనుగుల గుంపు గ్రామంలోకి చేరుకుని ఇళ్లను ధ్వంసం చేయడంతో గ్రామ‌స్థులు చాలా న‌ష్ట‌పోయారు. ఇళ్ల‌ల్లో ఏదైనా తిన‌డానికి దొర‌క్క‌పోతాయా అన్న దురాశ‌తో ఏనుగులు గ్రామస్తుల ఇళ్లలోకి ప్రవేశిస్తుండ‌టంతో ఇండ్లు నాశ‌నం అవుతున్నాయి. దాచిపెట్టుకున్న ఆహారప‌దార్థాల‌ను కూడా చెల్లాచెదురు చేస్తుండ‌టంతో తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌తిరోజు 12 నుంచి 14 వ‌ర‌కు ఉన్న ఏనుగుల గుంపు గ్రామంపై దాడి చేస్తుండ‌టంతో ఇక్క‌డి వారు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ్ర‌తుకులీడుస్తున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌మ గోడును ప‌ట్టించుకొని ర‌న్వాహి కొండ ప్రాంతంలో ఉండి దాడులు చేస్తున్న ఏనుగుల బారి నుంచి త‌మ‌ను కాపాడాల‌ని పిచ్చెట్టా గ్రామ‌స్థులు కోరుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

కొత్త‌ అలారం : 15 నిమిషాల్లో క‌రోనా గుర్తింపు..!

గైర్హాజ‌రు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం

చ‌రిత్ర‌లో ఈరోజు : గ‌ల్వాన్ వీరుల‌కు వంద‌నం

గోర్లను చూసి డ‌యాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!

ప్రోటీన్ వ‌న‌రు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్త‌మం

ఆంక్ష‌ల పొడ‌గింపు : బ్రిట‌న్‌ను భ‌య‌పెడుతున్న డెల్టా వేరియంట్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana