కరోనా విజృంభిస్తున్న సమయంలో, లాక్ డౌన్ కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. వేలాది మందికి సపోర్టుగా నిలిచి రియల్ హీరో అయిపోయాడు. సెకండ్ వేవ్ లో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొలి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి అందరూ జేజేలు పలుకుతున్నారు.
సోనూసూద్ అభిమానులు ఆయన కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలను వృధా చేయొద్దని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. పాలు అవసరమైన వారి కోసం వాటిని అందజేయాలని, పాలను వృధా చేయొద్దని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పాలాభిషేకాలు చేస్తున్న వీడియోలను ట్యాగ్ చేస్తూ పాలను పేదరికంలో ఉన్న వారికి అందజేయాలని సూచించారు.
Humbled ❣️
— sonu sood (@SonuSood) May 24, 2021
Request everyone to save milk for someone needy.🙏 https://t.co/aTGTfdD4lp
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!