సెక్స్ కోసం నన్ను వేధించారు: సల్మాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ
సోమీ అలీ | ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది డైరెక్టర్లు ఆఫర్ల కోసం తమతో పడుకోవాలని అడిగేవారని సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ సంచలన

సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కామన్ అయిపోయాయి. ఈ విషయంపై చాలా చర్చలే జరిగాయి. ఎంతోమంది హీరోయిన్లు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. మీటూ అంటూ దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఓ పెద్ద ఉద్యమమే జరిగింది. అయినా కూడా ఇండస్ట్రీలో వేధింపులు ఆగలేదని స్టార్ హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు. ఇదిలా ఉంటే ఇదే విషయంపై ఇప్పుడు పాకిస్తాన్ మోడల్ కమ్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోవాలని కొందరు దర్శకులు ఓపెన్‌గా అడిగేవారని చెప్పింది.

1991లో బాలీవుడ్‌కు వచ్చిన ఈ ముద్దుగుమ్మ వచ్చిన కొత్తలోనే సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడింది. అప్పట్లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని వార్తలు వచ్చాయి. కానీ కొద్దిరోజులకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోయిన సోమీ అలీ .. బాలీవుడ్లో తనకు ఉన్న చేదు జ్ఞాపకాల గురించి తాజాగా నోరు విప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ఆఫర్ల కోసం తమతో పడుకోవాలని అడిగేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదట్లో తన సినిమాలు బాగానే ఆడాయని, ఆ తర్వాత ఫ్లాపులు ఎదురయ్యాయని గుర్తు చేసుకుంది. ఫ్లాపులు వచ్చిన సమయంలో కూడా ఆఫర్లు కావాలంటే తమతో సెక్స్ చేయాలని కొంతమంది డైరెక్టర్లు ఓపెన్ అడిగేవారని చెప్పింది.

బాలీవుడ్‌లోని అనుభవాలతో పాటు అప్పట్లో తన రిలేషన్‌పై కూడా సోమీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఉన్న సమయంలో దారుణమైన రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పింది. ఏదేమైనా ఇలా బాలీవుడ్లో ఉన్న ఏడేళ్లలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని సోమీ పేర్కొంది. ఈమె చెప్పిన దారుణమైన రిలేషన్షిప్ సల్మాన్‌తోనే అని తెలుస్తోంది. సోమీ ఎన్ని సినిమాలు చేసినా కూడా సల్మాన్ మొదటి ప్రేయసిగానే ఎక్కువ గుర్తింపు పొందింది. నిజానికి హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదని, కేవలం సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశతోనే ఇండియాకు వచ్చినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోమీ చెప్పింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శిల్ప కళా వేదిక దగ్గర పవన్ ఫ్యాన్స్ సందోహం.. పాసులు లేకపోతే అంతే..
పవన్-హరీష్ శంకర్ మూవీ క్రేజీ అప్డేట్
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
రకుల్‌ప్రీత్‌సింగ్ లాఫింగ్ నినాదం
రాజ్‌పుత్ బ్యూటీ అందానికి స్టన్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ ఎంట్రీకి నాగబాబు రెడీ..!
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
మెగాస్టార్ ఆచార్య ‘లాహే లాహే’ సాంగ్‌కు భారీ రెస్పాన్స్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ
లవ్ ట్రాక్ గురించి చెప్పిన అంజలి
దిశాపటానీ స్టిల్స్ కు టైగర్ ష్రాఫ్ ఫిదా
బాలీవుడ్ నటి శశికళ కన్నుమూత..!
కాజల్ అగర్వాల్ ఔదార్యం..విద్యార్థిని ఫీజు చెల్లింపు
బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

