Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
man tries to dodge traffic police | వాహనాలను తనిఖీ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. ఒక బైకర్ వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెనుక కూర్చొన్న అతడి భార్య అదుపుతప్పి బైక్ నుంచి కిందపడింది. అయినప్పటికీ ఆ వ్యక్తి బైక్‌ను ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.
డెహ్రాడూన్: వాహనాలను తనిఖీ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. ఒక బైకర్ వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వెనుక కూర్చొన్న అతడి భార్య అదుపుతప్పి బైక్ నుంచి కిందపడింది. అయినప్పటికీ ఆ వ్యక్తి బైక్‌ను ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (man tries to dodge traffic police) ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 17న త్రిశూల్ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, హెల్మెట్లు ధరించని ద్విచక్ర వాహనదారులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కాగా, బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తిని ఆపమని ట్రాఫిక్ పోలీసులు సంకేతం ఇచ్చారు. అయితే ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. బైక్ వేగాన్ని పెంచాడు. ట్రాఫిక్ పోలీసుల పక్క నుంచి బైక్‌ను మళ్లించాడు. ఈ హఠాత్తు మలుపు వల్ల బైక్ వెనుక కూర్చొన్న ఆ వ్యక్తి భార్య అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది.
అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టించుకోలేదు. బైక్ నడుపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఆ మహిళను ట్రాఫిక్ పోలీసులు పైకి లేపారు. ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడిలో వైరల్ అయ్యింది.
😳 “Husband of the year” — he fled a challan and left his WIFE on the road
Viral video from Uttarakhand shows exactly how far someone will go to dodge a traffic fine.
WHAT HAPPENED
• Trishul Chowk, Rudrapur, Oct 17 — police checking drive for no number plates / no helmets
• A motorcyclist swerved to evade officers; his wife, riding pillion, fell onto the road
• He sped away WITHOUT stopping to help — officers rushed to her instead
• She reported NO injuries, was counselled and sent home (CO Vibhav Saini confirmed)
• The husband was made to submit a written apologyCONTEXT
The fine he was dodging would have cost him far less than this video will cost him online.Video: @HateDetectors / @hinduvision1 (X, Oct 17)
#India #ViralVideo
— Master the captain (@mollicksoif9) October 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

