బాలీవుడ్ సీనియర్ నటి శశికళ ఓం ప్రకాశ్ సైగల్ (88)కన్నుమూశారు. షోలాపూర్‌లోని మహారాష్ట్రియన్ ఫ్యామిలీలో జన్మించిన శశికళ ఆదివారం ముంబైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోండగా..దీనిపై ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శశికళ 100కు పైగా చిత్రాల్లో నటించారు. షారుక్‌ఖాన్‌తో పలు చిత్రాల్లో నటించారు.
బాద్షాలో షారుక్ తల్లిగా, కభి ఖుషీ కభీ ఘమ్ చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్ లో కనిపించారు. ముజ్సే షాదీ కరోగి మూవీలో సల్మాన్ ఖాన్ నానమ్మగా మెప్పించారు. శశికళ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శశికళ 2007లో భారత సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగాను పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. మదర్ థెరిసా ఫాలోవర్ శశికళ. కొలాబాలోని చర్చిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.