కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక లోకమంతా ఏకమై తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా..
– నల్లగొండలో ఘనంగా ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం
రామగిరి, అక్టోబర్ 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక లోకమంతా ఏకమై తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సమూలంగా మారుస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ రిజర్వుడ్ హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాడాలని కోరారు.
సమ్మె హక్కును కాలరాస్తున్నారు : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ
ఈ సమావేశానికి ఎన్. రామస్వామి అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి సమ్మె చేసే హక్కును, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును కాలరాయడం దారుణమన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో కార్మికులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ప్రధాన డిమాండ్లు
అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి, ఔట్ సోర్సింగ్ దోపిడీ వ్యవస్థను రూపుమాపాలి. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అక్టోబర్ 31న ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయిలో జెండాలు ఎగురవేసి, భారీ సభలు-సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్ రెడ్డి, జిల్లా నాయకులు దొటి వెంకన్న, నూనె వెంకటేశ్వర్లు, బరిగెల వెంకటేష్, ఎండీ జానీ, బంటు రాజేశ్వరి, కోట్లా శోభ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

