US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
US-Iran : మిడిల్ ఈస్ట్ సహా వివిధ దేశాల్లో ఉన్న అమెరికా రాయబార సిబ్బందితోపాటు, అమెరికా ఇతర అధికారుల హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ మేరకు అమెరికా నిఘా విభాగానికి ఒక నివేదిక అందింది.
US-Iran : ఇరాన్-అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య శతృత్వం తారస్థాయికి చేరింది. ఇరాన్‌కు చెందిన అగ్రనేతల్ని అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మిడిల్ ఈస్ట్ సహా వివిధ దేశాల్లో ఉన్న అమెరికా రాయబార సిబ్బందితోపాటు, అమెరికా ఇతర అధికారుల హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు తేలింది.
ఈ మేరకు అమెరికా నిఘా విభాగానికి ఒక నివేదిక అందింది. దీంతో అప్రమత్తమైన అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. వివిధ దేశాల్లో పని చేస్తున్న అమెరికా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందు జాగ్రత్త చర్యగా వివిధ దేశాల్లోని రాయబార సిబ్బందిని అమెరికా తగ్గిస్తోంది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ రుబియో ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు దిగారు. అమెరికాకు అందిన నివేదిక ప్రకారం అమెరికా పౌరుల హత్యకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొంతకాలంగా కుట్ర చేస్తోంది. ఈ ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నట్లు తెలిపింది.
అమెరికా పౌరుల్ని అంతం చేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత తక్కువ, ముప్పు ఎక్కువ ఉందని భావించే దేశాల నుంచి రాయబార సిబ్బందిని అమెరికా తగ్గిస్తోంది. అమెరికా పౌరుల్ని సొంత దేశానికి రప్పించుకుంటోంది. సిబ్బందిని తిరిగి రావాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా మరోసారి తీవ్ర దాడులకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Americans
- iran
- middle east
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

