చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ | అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసినిని అడిగారు. కానీ చిరు చెల్లెలు పాత్రకి వాళ్లు నో చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య సినిమా మే 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన లుక్స్, లాహే లాహే సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత వేదాళం, లూసీఫర్ రీమేక్‌లలో నటించబోతున్నాడు చిరంజీవి. వీటిలో లూసిఫర్ రీమేక్ ముందుగా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఇందులో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. దీంతో ఇప్పుడు చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను అడుగుతున్నట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

లూసిఫర్ మలయాళ మాతృకలో మోహన్ లాల్ చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి కూతురుగా ఆ పాత్రను మంజు వారియర్ చేసింది. ఇక్కడ అదే పాత్ర కోసం ఇప్పటికే నయనతార, త్రిష, విజయశాంతి, సుహాసిని, లాంటి హీరోయిన్లను అడిగారు. కానీ చిరంజీవి చెల్లెలు గా నటించేందుకు వాళ్లు నో చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ పాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ మధ్య వరలక్ష్మి తెలుగులో చాలా బిజీ అయిపోయింది. నాంది, క్రాక్ లాంటి సినిమాలతో 2021లో వరస విజయాలు అందుకుంది. పైగా ఈమె నటనకు ఇక్కడ ఫిదా అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా పాజిటివ్, నెగిటివ్.. కారెక్టర్ ఏదైనా కూడా అందులో రప్ఫాడిస్తుంది వరలక్ష్మి. అందుకే ఇప్పుడు లూసీఫర్ రీమేక్ కోసం ఆమెను అడుగుతున్నారు. అయితే ఈ పాత్ర కోసం వరలక్ష్మి ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఆలోచనలో పడిపోతున్నారు మేకర్స్. ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే లూసీఫర్ రీమేక్ సెట్స్ పైకి రానుంది. ఇందులో హీరోయిన్ లేకుండానే నటింబోతున్నాడు చిరంజీవి. పొలిటికల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
‘పుష్ప’ నుంచి మరో క్రేజీ అప్డేట్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

