దిశాపటానీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్ట్ చేసిన స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. బ్యాక్ లెస్ టాప్, డెనిమ్ స్కర్ట్, హాఫ్ టై హెయిర్ స్టైల్‌తో కెమెరావైపు చూస్తున్న హాట్ స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. మూడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దిశాపటానీ ఫొటోలకు ఆమె బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్, కృష్ణా ష్రాప్ ఇంప్రెస్ అయ్యారు. ఈ ఫొటోలకు తక్కువ సమయంలోనే 500kకు పైగా లైక్స్ వచ్చాయి. దిశా-టైగర్ తరచూ డిన్నర్ డేట్స్ కు వెళ్తూ ముంబైలో షికార్లు చేస్తుంటారనే సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు స్పందిస్తూ కామెంట్లు పెడుతుంటారు.
దిశాపటానీ ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ తో రాధే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు మోహిత్ సూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఏక్ విలన్ రిటర్న్స్ లో కూడా నటిస్తోంది.